AP 39TV 09ఏప్రిల్ 2021:
జై జవాన్ జై కిసాన్ వినాదం ఇప్పుడు నై జవాన్ నో కిసాన్ గా నరేంద్ర మోడి మార్చారు.ఎందుకు BJP ప్రభుత్వం ఇంత ద్వేషం రైతు ల మీద పెంచుకున్నారు.వారు నిజాయితీగాను,ఎన్ని కష్టాలు ఎదురు అయినా దేశ ప్రజలకు ఆహార ధాన్యాలు పండించడమేనా వారు చేసిన పాపం.మోడీ 7 సంవత్సరాల పాలనలో రైతు లకు ఏమైనా ఒక మంచి చేశారా ? ఆయన తీసుకొన్న నిర్ణయాల వలన ఇప్పటికే 4 నెలలు గా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతు లు ఈ ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న 400 మంది రైతులు అమరులైన కనీసం స్పందించలేదు మరి ఇప్పుడు రైతులు పంటల సాగుకు వాడే ఎరువుల ధరలు 55% శాతం పెంచడానికి ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. అంటే BJP అంటే రైతుల కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని వారి నిర్ణయాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు BJP కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ సంపద ను, ఈ దేశంలో ఉన్న ప్రకృతి వనరుల ను,ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థల ను,రైతు ల సాగు భూమి ని,రైతు లు పండించిన పంటలను,వారికి అప్పగించ డానికే పాలన చేస్తున్నారు.అందుకే నరేంద్రమోదీ 7 సంవత్సరాల పాలనలో 20 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ ని బ్యాంకు ల నుంచి రుణాలు తీసుకుని ఎగ వేసిన కార్పొరేట్ వ్యక్తుల కు మాఫీ చేశారు. ఒక రూపాయి అయినా ఈ దేశ రైతు లకు రుణమాఫీ చేశారా?.ఈరోజు ఎరువుల కంపెనీలకు లబ్ది కలిగించే పనిని BJP చేపడుతున్న ది.మరి వారి లాభాల కోసం రైతుల కు అధిక భారం కలిగే విధంగా ఎరువుల ధరలు పెంచ డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పని చేసిన UPA ప్రభుత్వం రైతులకు దేశంలో 72 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. పావల వడ్డీ కి రైతు లకు రుణాలను అందచేశారు. ఎరువుల కు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇలా UPA పాలన జరిగితే.BJP రైతు గొంతు మీద గన్ను పెట్టి పాలన చేస్తున్నారు. ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ తగ్గించారు.ఎరువుల ధరలు పెంచుతూ పోతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వరు,రుణాలు మాఫీ చేయరు ,మరి రైతు ఎలా జీవించాలి. ఈ 7 సంవత్సరాల లో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం కు ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తుంది. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలను అవలంబించే BJP ని దేశ సరిహద్దులు దాటించాలి అని కాంగ్రెస్ పార్టీ రైతు లకు ,ప్రజల కు పిలుపు నిస్తూ,ఎరువుల ధరలను తగ్గించాలని, పంటల కు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, రైతు వ్యతిరేకంగా ఉన్న మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వాసు,జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.