Header Top logo

ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయం

ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయం

పత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్, మే 24 : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల దేవత పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మించారు. దేవదాయ నిధులతో పాటు ప్రత్యేకంగా విరాళాలు సేకరించి ఈ దేవాలయం నిర్మాణం చేసినట్టు ముదిరాజ్ కులస్థులు తెలిపారు.

ప్రహారి గోడ నిర్మాణం కోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియోజక వర్గ నిధుల నుంచి ఐదు లక్షలు మంజూరు చేశారు.

అయితే.. బుధవారం నూతనంగా నిర్మాణం చేసిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు బ్రహ్మణులు.

వేద మంత్రాల సాక్షిగా ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు చేసిన పురోహితులు విగ్రహ ప్రతిష్ట చేశారు.

అయితే.. బుధవారం ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట తరువాత ప్రత్యేకంగా పూజలు చేసారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ముదిరాజ్‌ కులస్తులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు పండ్లు అమ్ముకుని బతుకులు వెళ్ల తీసే ముదిరాజ్ ల జీవన విధానంలో మార్పు వచ్చిందన్నారు.  చదువు కోవడం ద్వారా అభివృద్ది చెందుతారన్నారు ఆయన.

శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ కులస్థుడని గుర్తు చేశారు. అలాగే కేశపల్లి గ్రామానికి చెందిన యాటకర్ల మల్లేష్ జర్నలిస్ట్ గా ఎదిగారన్నారు ఎమ్మెల్యే. గంగారెడ్డి వల్ల  కేశపల్లి గ్రామం పేరు అందరికి తెలిసిందని ఆయన మరణం, అతని కుమారుడు ఆనంద్ రెడ్డి మరణం బాధ కరమన్నారు. ఇక ముందు కేశపల్లి గ్రామాభివృద్ది బాధ్యత తాను తీసుకుంటానన్నారు గోవర్ధన్.

పెద్దమ్మ తల్లి దీవెనలు ప్రతీ ఒక్కరి మీద ఉంటాయని, తను గ్రామ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలబడతానని అన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు పెద్దమ్మ దేవాలయం చైర్మన్ యాటకర్ల దేవేష్. దేవాలయ నిర్మాణంకు నిధులు ఇచ్చిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు దేవాలయ కమిటీ.

ఆ సందర్భంగా పలువురు దాతలను సన్మానించారు.

ఈ సమావేశంలో ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, కేశ్‌పల్లి సర్పంచ్‌ మైదం మహేశ్వర్‌, సీనియర్‌ జర్నలిస్టు యాటకర్ల మల్లేశ్‌, ఎంపీటీసీ మున్నూరు గంగాధర్‌, పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ చైర్మన్ యాటకర్ల దేవేశ్‌, క్యాషియర్‌ యాటకర్ల శ్రీధర్‌, క్రాంతి, ఎర్రోళ్ల ప్రశాంత్‌, హరీశ్‌, నరేందర్‌,

మహేందర్‌, సాయిలు,యాటకర్ల అవినాశ్‌, జనార్ధన్‌, మాజీ ఎంపీపీ మైదం రాజన్న (కాంట్రాక్టర్‌), మాజీ ఎంపీపీ అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking