Header Top logo

22న పిట్టల రవీందర్ ముదిరాజ్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం

22న పిట్టల రవీందర్ ముదిరాజ్

పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి!

పిట్టల రవీందర్‌.. ఈ పేరు వింటే ఓ జర్నలిస్ట్ గుర్తుకు వస్తాడు.. తెలంగాణ ఉద్యమ కారుడు గుర్తుకు వస్తాడు.. మత్స్య కార్మికుల బతుకులను చూసిన మత్స్యరంగ నిపుణుడు గుర్తుకు వస్తాడు. జర్నలిస్ట్ గా సుధీర్ఘ కాలం పాటు పని చేసిన పిట్టల రవీంధర్ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర మ త్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా 22 మే 2023న బాధ్యతలు స్వీకరించనున్నారు.  

మే 22వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంకు (శాంతినగర్ , రోడ్ నెంబర్ 4)  “మత్స్య భవన్ లో చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభసందర్భంగా  కంగ్రాట్స్ చెబుదాం..

రాష్ర్టంలో అత్యధికంగా (సుమారు 80శాతం) మత్య్స సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి శ్రీ పిట్టల రవీందర్ ముదిరాజ్ గారు దాదాపు 10 సంవత్సరాలుగా తెలంగాణ మత్స్యరంగం పైన సమగ్రమైన అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు.

 మత్స్యరంగంపై పరిశోధనలు నిర్వహిస్తూ … జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషిచేస్తున్న అనేక సంస్థల్లో శ్రీ పిట్టల రవీందర్ ముదిరాజ్ గారు సభ్యులుగా ఉన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో పర్యటించడమే కాకుండా వివిధ దేశాల్లో పర్యటించి..‌ అనేకమైన అంతర్జాతీయ సదస్సుల్లో శ్రీ పిట్టల రవీందర్ ముదిరాజ్ గారు పాల్గొని విశేషమైన అనుభవాన్ని గడించారు.

శ్రీ పిట్టల రవీందర్ ముదిరాజ్ గారు సాంప్రదాయ మత్స్యరంగంతోపాటుగా, ఆక్వా కల్చర్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న మార్పులను, ఆధునిక విధానాలను ఆకళింపు చేసుకుని తెలంగాణ మత్స్యరంగం మీద ఆధారపడిన మత్స్యకారుల్లోనూ, ఔత్సాహికుల్లోనూ అవగాహన కలిగించేందుకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వందలాది వ్యాసాలు రాయడమే కాకుండా, అనేక పుస్తకాలను ప్రచురించారు.

ఆక్వా కల్చర్ మరియు మత్స్యరంగంలో విశేషం అనుభవం గడించిన

శ్రీ పిట్టల రవీందర్ ముదిరాజ్ గారికి కంగ్రాట్స్…

తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మెన్ గా నియమితులైన శ్రీ పిట్టల రవీందర్ ముదిరాజ్ గారు మే 22వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంకు (శాంతినగర్ , రోడ్ నెంబర్ 4) పొందుగల “మత్స్య భవన్” లో చైర్మెన్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న చారిత్రాత్మకమైన శుభసందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేసభ లో పాల్గొనేందుకు రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లోని మత్స్యసహకార సంఘాలకు నాయకత్వం వహిస్తున్న బాధ్యులందరూ తరలిరావాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తోంది.

పిట్టల రవీందర్ జీవిత ప్రస్థానం వీడియా…

  • వయ్యామ్మెస్ ఉదయశ్రీ

 

Leave A Reply

Your email address will not be published.

Breaking