Header Top logo

మే 26న ‘యూనివర్సిటీ’ మూవీ రిలీజ్

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఆధ్వర్యంలో

మే 26న ‘యూనివర్సిటీ’ మూవీ రిలీజ్

హైదరాబాద్, మే 10 : పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’ మూవీ మే 26న గ్రాండ్ రిలీజ్ కానుంది.
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈనెల 26 న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో యూనివర్సిటీ సినిమాను ప్రదర్శించారు. అనంతరం మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి శ్రీనివాస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి , ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులు శ్రీనివాస్  మాట్లాడుతూ.. చరిత్రలో జరిగిన సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నవి  చాలా గుర్తుకు వస్తాయి. విద్య వైద్య రంగంలో ఉన్న సమస్యలను కళ్ళకు కట్టినట్టు  సినిమా గా తీశారు. మన వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరుగుతువున్నాయి కానీ మనం వ్యతిరేఖించలేక పోతున్నాం. నారాయణ మూర్తి లాంటి వారు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యగలరు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి అని అన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి  మాట్లాడుతూ… సందేశాత్మక చిత్రం అంటే సామాజిక చైతన్యం, స్పృహ కలిగించే విధంగా వుండాలి. అలాంటి సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న సంఘటనలను సినిమాలో చూపించారు. ఇలాంటి సినిమా రావడం సంతోషం. ఈ సినిమా బాగా ఆడాలి ఆయనకు మంచి పేరు రావాలి. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి అని అన్నారు.

ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ  మాట్లాడుతూ… విద్యా ప్రవేటికరణ దాని దుష్పరిణామాలు చక్కగా చూపించారు. కోచింగ్ తో పాటు ఉద్యోగాలను ఎలా పక్కదారి పట్టించారో సినిమాలో చూపించారు. ప్రవేటికరణ ద్వారా విద్యను కొంటున్నాం. విద్యని వ్యాపారంగా చూడకూడదు. ఈ సినిమా తీసినందుకు నారాయణ మూర్తి గారికి థాంక్స్ అని అన్నారు.

ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు  మాట్లాడుతూ… 4 దశాబ్దాలుగా ప్రజల సమస్యలను చూపిస్తున్న ఆర్ నారాయణ మూర్తిని పీపుల్స్ స్టార్ అంటారు. ఆ పీపుల్స్ స్టార్ అనే పదం ఆస్కార్ కంటే గొప్ప అవార్డ్ అని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా అనేక సంఘటనలను మనకు చూపించారు. పాటలు భిన్నంగా వున్నాయి. బడుగు బలహీన వర్గాలు, పాడిత పీడిత వర్గాలకు అండగా వుంటారు ఆర్ నారాయణమూర్తి. తన సినిమాల ద్వారా చైతన్యాన్ని అందిస్తున్నారు అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking