About Us

జిందగీ.. తొలి అడుగులు..

నీది, నాది, మనందరి జీవితమే ఈ జిందగీ.. గంజాయి వనంలో తులసి మొక్కలా జీవించే మహానుభావులను పరిచయం చేయడం, ఈ జిందగీ ఉద్దేశం..

ఆర్మీ జవాన్.. నక్సలైట్.. పోలీస్.. కామన్ మెన్.. టీచర్.. ఫార్మర్.. అడ్వోకెట్..  జర్నలిస్ట్  ఇలా వృత్తి ఏదైనా సరే..  వారిలోని గొప్పతనాన్ని, వారు చేస్తున్న చిన్న పని అయినా సరే.. అవి సమాజానికి ఉపయోగపడుతున్న తీరును   పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘జిందగీ’ మీ ముందుకు వస్తోంది.

మన శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం… అలాగే సమాజానికి విశ్లేషణ– వివేచనే మహా భాగ్యం అనే సూత్రం ‘జిందగీ డాట్ కమ్’ కి హృదయం. 

Zindhagi.com కి ఎవరు వచ్చినా…  అందులో ఉండే  స్టోరీలు ఆ మనిషికి రొటీన్ కి భిన్నంగా మార్పును, ఓదార్పును కలిగిస్తాయనేది మా నమ్మకం. దారి తప్పే పొలిటికల్ లీడర్స్ కు చురకలు అంటిస్తూ హాట్.. హాట్ వార్త కథనాలు ఉంటాయి..

కథ– కవిత్వం, వార్త– వ్యాసం…అభిరుచి– అభిప్రాయం… ఆరోగ్యం, ఆధ్యాత్మకం ఇలా ఏది రాస్తారో మీ ఇష్టం.  జీవితం తాలూకు ఏ కోణాన్ని  సృజనాత్మకంగా స్పృశించినా…  ఆ అక్షర మాలను స్వీకరించి, ఆ పరిమాళాలను నలుగురికీ పంచడానికే మీ, మన జిందగీ. మీ పేరు, ఫోటోతో ప్రచురిస్తాం.

మరి జిందగీ కి భాష ఏంటి? అంటే మనం మన ఫ్రెండ్‌కి ఏదైనా ముచ్చట చెప్తే ఎలా ఉంటుందో అలాగే మీ అక్షరాలు ఉంటే..  పాఠకుడు కూడా మీకు పరోక్షంగా ఫ్రెండ్ అయిపోతాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ తో కాకుండా మీరు చెప్పే విషయమే ప్రచురణకు కారణమవుతుంది.

డిజిటల్ మీడియాతో ఎప్పటికప్పుడు ఆఫ్ డెట్ అవుతూ మాలో లోపాలు ఉంటే ఆత్మవిమర్శ చేసుకుంటూ మీ ప్రేమాభిమానం సాధించడమే ‘జిందగీ’  ప్రయత్నం, లక్ష్యం!

‘జిందగీ’ చేతి పట్టుకుని నడిపిస్తారాని, మా బుడి బడి అడుగులకు మీ ప్రోత్సాహం ఉంటుందనే చిన్ని ఆశతో… మీ అందరికీ Zindhagi.com కి సుస్వాగతం.

 

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Breaking