Header Top logo

సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ

ఈ దొంగ మామూలోడు కాదు. ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు.
ఆ సమయంలో వాహనానికే తాళం ఉండటంతో సులభంగా తీసుకెళ్లిపోయాడు. ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. గాలింపు చర్యలను మొదలు పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది నవంబర్ 5న ఒడిశా రాయగఢ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఒక దుండగుడు అపహరించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking