Header Top logo

గల్ఫ్ కార్మికులను ఆదుకొవడానికి సంక్షేమ బోర్డు..

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ప్రకటించాలి : కోటపాటి

కన్నవారిని ఉన్నఊరిని కట్టుకున్న ఆలిని కడుపున పుట్టిన పిల్లలను వదిలి సప్తసముద్రాలు దాటి ఆర్థికంగా సమాజంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో గల్ఫ్ బాటపట్టిన బాటసారికి చివరకు కన్నీరే మిగులుతుంది.

దుబాయిలోని బర్ దుబాయి ప్రాంతలోని ఆల్ మొగల్ హోటల్ లో జంగం బాలకిషన్ ఆధ్వర్యంలో మెగ్రెంట్ రైట్స్ అండ్ వెల్ఫెర్ ఫోరం ఆదివారం నిర్వహించిన గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు సాధన కార్యక్రమంలో కోటపాటి నర్సింహనాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతను మాట్లడుతూ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ చివరి బడ్దెట్ సమావేశంలో 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ప్రవేశ పెట్టాలని లేనియెడల వచ్చే ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల సత్తా చవిచూడాల్సి వస్తుందన్నారు.

గల్ఫ్ తో సహా 18 దేశాలలో పనిచేసే ప్రవాసి కార్మికులకు ఉపయోగపడే చట్టబద్ధమైన తెలంగాణ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి కోసం వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడుతున్న తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, రూ.500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గల్ఫ్ దేశాలలో పని చేసే కార్మికులకు సాంఘిక భద్రత, ఆయా దేశాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన కార్మికుల పునరావాసం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని అన్నారు. ప్రతి వలస కార్మికుడిని బోర్డులో చేర్చుకొని పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, కల్లెడ భూమన్న, జైత నారాయణ, ఆకుల సురేందర్, వంశీగౌడ్, రవి, దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవాసమితి కో ఆర్డినేటర్లు వేణుగోపాల్ బోగ, ఎలిగేటి గంగాధర్, రవి డేవిడ్, లక్ష్మీరాజం ఎనుగంటి లతో పాటు వందలాది గల్ఫ్ కార్మిక సోదరులు పాల్గొన్నారు.

– దుబాయ్ నుంచి వేణు గోపాల్ బోగ..

Leave A Reply

Your email address will not be published.

Breaking