లోక్ సభ ఎన్నికల్లో ఒకరు ఐపీఎస్, మరోకరు ఐఎఎస్
– నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్
– మెదక్ వెంకట్రామిరెడ్డి
నిర్దేశం, హైదరాబాద్ :
ఔను.. వాళ్లిద్దరు పోటీ చేస్తున్నారు. ఒకరు ఐపీఎస్, మరోకరు ఐఎఎస్.. తమ పదవులకు ఇది వరకే రాజీనామా చేసిన వాళ్లిద్దరు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలబడనున్నారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి పి. వెంకట్రామిరెడ్డిని పోటీకి దించుతున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలకు ఇంకా పార్టీ అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. గతంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మంనుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, మల్కాజిగిరినుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు.
Prev Post
Next Post