Header Top logo

అందరి నోటా ఉదయం స్వేచ్ఛా మాట

ఆనందం పరమానందం…ఆనందం బ్రహ్మానందం

ఉదయం నుంచీ సాయంత్రం వరకు…
ఆనాటి అంటే 32 సంవత్సరాల క్రితం ఉదయం పేపర్లో…
ఉదయం వీక్లీలో…శివరంజని వీక్లీలో… కలిసి పనిచేసిన
ఉద్యోగులందరం ప్రెస్ క్లబ్ లో కలుసుకున్నాం.

అందరం ఒకతల్లి కడుపున పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ
ప్రేమాభిమానాలతో పలకరించుకున్నాం. భోజనాలు చేశాం.
పాటలు పాడుకున్నాం… పరమానందభరితులమయ్యాం!

కాకినాడ కాజాలు,పూతరేకులతో సహా భోజనాలు అద్భుతంగా తయారు చేయించిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలండీ.

ఇన్ని వందలమందిమి ఇలా కలవడానికి ఎంతో ప్రయాసతో
ఎన్నో ఏర్పాట్లు చేసిన సైదారెడ్డిగారికి, హేమసుందర్ గారికి…
ఇంకా ఇతర మిత్రులందరికీ… పేరుపేరునా మన మిత్రులందరి తరపునా లక్షలాది, శతకోట్లాది హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను🙏🙏🙏

  • శివప్రసాద్    

—-   —–     —–

అందరి నోటా ఉదయం మాట..

‘ఉదయం’ ఆత్మీయ సమ్మేళనంలో

‘ఉదయం’ మా హృదయం అంటూ ఓన్ చేసుకుంది ‘ఉదయం’ కుటుంబం.

నవ్వుతూ పలుకరింపులతో మధురమైన జ్ఞాపకాలకు వేదికగా మారింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ఎన్నో ఏళ్ల తరువాత కలిసిన ఆత్మీయులను హృదయంకు అత్తుకుంటూ ప్రేమతో పలుకరించుకోవడం కనిపించింది.

షేక్ హ్యండ్ ఇస్తూ కొందరు.. నమస్కారం పెడుతూ మరి కొందరు విష్ చేసుకోవడం.. సెల్ ఫోన్ లతో సెల్ఫీలు.. సీనియర్స్ తో గ్రూప్ ఫోటోలు.. అక్కడి వాతావరణంను అక్షరాలలో వర్ణించలేమెమో..?

‘ఉదయం’లో ఇన్ చార్జీగా విధులు నిర్వహించిన నాటి సీనియర్స్ కనిపించగానే వినయంతో దగ్గరికి వెళ్లి ‘నమస్కారం… సార్..’’ నేను ఫలానా అంటూ పరిచయం చేసుకున్నారు. జర్నలిజంలో పితామహులు ఎబికే ప్రసాద్ గారు మరియు కే.రామచంద్రమూర్తి గారు వేదికపై ఆశీనులయ్యారు.

ఒక్కొక్కరు వేదిక పైకి వెళ్లి ‘ఉదయం’తో అనుభవాలను షేర్ చేసుకున్నారు. పేరు.. ఊరు పరిచయం చేసుకుంటూ అందరి నోటా ‘ఉదయం’ మాట వినిపించింది.

సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి రోజులలో కుళ్లి పోయిన జర్నలిజం వ్యవస్థను చూసి బాధ పడుతునే నాటి ‘ఉదయం’ రోజులలో ఉన్న స్వేచ్ఛాను గుర్తు చేసుకున్నారు.

ఒకప్పుడు ‘ఉదయం’లో ఎబికే ప్రసాద్ గారి సారధ్యంలో పని చేసిన వారే నేడు వివిధ పత్రికాలలో.. న్యూస్ టీవీలలో పని చేస్తున్న వారిని గుర్తు చేశారు కొందరు.

ప్రజల కోసం ప్రాణాలు ఆర్పించిన కమ్యూనిష్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి మరణిస్తే, కిష్టగౌడ్ – భూమయ్యలను ఉరి తీస్తే వార్త వేయలేని నాటి పరిస్థితులను గుర్తు చేశారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి.  ‘ఉదయం’ రావడంతోనే స్వేచ్ఛగా వార్త కథనాలు ఇచ్చామన్నారు ఆయన.

‘ఉదయం’ ప్లే గ్రౌండ్ లాంటిది. దాసరి నారాయణ రావు, ఎబికే ప్రసాద్ గారు పుల్ ఫ్రీడం ఇచ్చారు. అలాంటి రోజులు రావాలంటే నేటి సమాజంను డామినెట్ చేస్తున్న సోషల్ మీడియాలోకి మనం ప్రవేశించాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘ఉదయం’ న్యూస్ వెబ్ సైట్.. డిజిటల్ ఫ్లాట్ ఫాం లాంటివి తీసుక వద్దామని సూచన చేశారు మరి కొందరు. రాంచందర్ మూర్తి గారు ముందుకు వస్తే ‘‘మేము సైతం.. ’’ అంటూ సైనికుల్లా పని చేస్తామంటున్నారు ఉదయం జర్నలిస్టులు.

‘ఉదయం’లో యజమాన్యంపై  జోకులు వేసే స్వేచ్ఛా ఉండేదన్నారు సీనియర్ జర్నలిస్టులు. సమస్యలు పరిష్కారించాలని దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు చేస్తున్నసమ్మెకు మద్దతుగా ‘ఉదయం’ యజమాన్యం నిర్ణయించడం చరిత్రలో నిలిసి పోయిందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్.

‘ఉదయం’ పత్రికా మన ఈనాడును మింగేస్తోందని రామోజీరావు భయపడేవారని, ‘ఉదయం’ ఇన్వెష్టిగేషన్ రిపోర్ట్ కు ప్రధాన్యత ఇచ్చారన్నారు ఆయన.  బిహెచ్ ఇఎల్ పోలీసు స్టేషన్ లో నీలా అనే మహిళను 40 రోజులుగా అక్రమంగా ఉంచుకుని అత్యాచారం చేస్తున్నారని ఇన్వెష్టిగేషన్ చేసి వరుసగా కథనాలు ఇస్తే సుప్రీం కోర్టు జోక్యంతో ప్రభుత్వం పోలీసు అధికారిపై చర్యలు తీసుకుందన్నారు అమర్. నక్సలైట్ అనే ముద్ర వేసి తనను ఎన్ కౌంటర్ చేస్తారెమోనని భయపడ్డ విషయం గుర్తు చేసారు దేవుల పల్లి అమర్.

‘ఉదయం’ కుటుంబంలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్న మనవారిని ఒక ప్లాట్ ఫాం మీదికి తీసుక వస్తే బాగుంటుందన్నారు సీనియర్ జర్నలిస్ట్   గోవింద రాజుల చక్రధర్. దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఏదైనా సహాయం కావాల్సి వస్తే మన ‘ఉదయం’ సర్వీస్ తీసుకునే అవకాశం చేస్తే ఇంకా బాగుంటుందన్నారు ఆయన.

హైదరాబాద్ నగరంకు దూరంగా ల్యాండ్ తీసుకుని ‘ఉదయం’ కాలొని పేరుతో ఇల్లు కట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీనియర్ జర్నలిస్టులు.

జర్నలిస్టులకు తీపి గుర్తులు లేవు.. బీపీలు.. షుగర్స్ ఉన్నాయని తనదైన శైళిలో మాట్లాడారు సీనియర్ జర్నలిస్ట్ వెంకట రమణ. ‘ఉదయం’ను జీవితానికి అనువాదించుకోవాలని అభిప్రాయ పడ్డారు ఆయన.

ఏమాండోయ్ లీడరు గారు.. లేవాండోయ్ తెల్లారింది అంటూ ఉపన్యాసం ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మన్ రావు.

‘ఉదయం’ ఆత్మీయ సమ్మేళనం నిర్వహకులు గురువారెడ్డి, సైదారెడ్డి, హేమ సుందర్ లతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సీనియర్ జర్నలిస్టులు.

‘ఉదయం’ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాష్కర్, దేవరకొండ కాళిదాస్, సైదారెడ్డి, హెమసుందర్ రావు, రవికాంత్ రెడ్డి,  గురువారెడ్డి, మృణాళిని, శంకర్ నారాయణ, సీవీఎస్ రమణారావు, సిర్ప గంగాధర్, చైతన్య ప్రసాద్.

నోట్ : సారీ… అందరి పేర్లు ఈ స్టోరీలో రాయలేక పోవడానికి నా వద్ద సమాచారం లేక పోవడమే.

     యాటకర్ల మల్లేష్,

జర్నలిస్ట్. 9492225111

Leave A Reply

Your email address will not be published.

Breaking