ఏపీ 39టీవీ 12 ఫిబ్రవరి 2021:
ఆంధ్ర ప్రజల త్యాగాలతో సాధించుకున్న ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జిల్లా స్థాయి సదస్సును నగరంలోని స్థానిక వి కే మెమోరియల్ హాల్ నందు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ , విశాఖ ఉక్కు సాధన కమిటీ మాజీ కన్వీనర్ ఎం వి రమణ , సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకై జరిగిన పోరాటాల లో ఏఐఎస్ఎఫ్ అగ్రభాగాన ఉన్న విషయాన్ని గుర్తు చేశారు, అందుకనే నేడు మరల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై పోరాటాలు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు, 32 మంది ప్రాణ త్యాగాల తో మరియు అనేక పోరాటాల తో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన నిర్ణయమని అన్నారు, నష్టాల్లో ఉందని సాకులు చెప్పి ప్రజలను మోసం చేయొద్దని వాటికి సరిపడా ముడీ సరుకులను పంపిణీ చేసి ఇనుప గనులను కేటాయించి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ సంస్థల నుండి వ్యవసాయ రంగం వరకు కార్పొరేట్ లకి అప్పజెప్పే విధానాన్ని దుయ్యబట్టారు, మోడీ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 19 నుంచి జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
కార్యక్రమాల వివరాలు::
1) ఫిబ్రవరి15న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కళాశాలల ఎదుట గేట్ మీటింగ్ లు
2) ఫిబ్రవరి 17న సంతకాల సేకరణ
3) ఫిబ్రవరి 18న ప్రజాప్రతినిధులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం
4) ఫిబ్రవరి 19న అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం
5) ఫిబ్రవరి 25 నుండి జిల్లాలో జిల్లావ్యాప్తంగా బైక్ ర్యాలీ
ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు వి కే రంగారెడ్డి ,కల్లప్ప , ఏఐఎస్ఎఫ్ నాయకులు రమణయ్య, వీరు యాదవ్, హనుమంత రాయుడు, చంద్రశేఖర్, చిరంజీవి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.