Header Top logo

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన – కాంగ్రెస్ పార్టీ పాచిపెంట శాంతకుమారి

AP 39TV 30 ఏప్రిల్ 2021:

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలన్న ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ & అరకు పార్లమెంట్ స్టేట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి.
కరోనా సెకండ్ వేవ్‌లో పరీక్షలు అవసరమా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వెంటనే పరీక్షలు రద్దు చేసి ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.కరోనా సెకండ్‌ వేవ్‌తో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం ప్రభుత్వ మూర్ఖత్వమన్నారు.కరోనా తీవ్రతతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్కూళ్లు, హాస్టల్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారని గుర్తు చేశారు. జూనియర్‌ కాలేజీలు, ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లు, వాటి హాస్టళ్లలో ఉన్నవారు ఈ వైరస్‌ సోకి ఇబ్బందులు పడుతున్నారన్నారని అన్నారు.పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. తరగతులు, పరీక్షల కోసం వెళ్ళి వచ్చే విద్యార్ధుల ద్వారా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందన్నారు. విద్యార్థులతో పాటూ వారి కుటుంబాలను ప్రభుత్వం నేరుగా కరోనా ముప్పులోకి గెంటి వేస్తున్నట్లే అని వ్యాఖ్యానించారు. ఆ విద్యార్థుల కుటుంటాల్లో వయసు పైబడినవారు, వృద్దులు, దీర్హకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారన్నారు. వారందరినీ కరోనా చుట్టుముడితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే సి.బి.ఎస్‌.ఈ. 10వ తరగతి పరీక్షలు రద్దు చేశామని కేంద్ర ప్రకటించిందని.. పొరుగున తెలంగాణ ప్రభుతం కూడా ఈ పరీక్షలు రద్దు చేసిందని గుర్తు చేశారు. సి.బి.ఎస్‌.ఈ., తెలంగాణ విద్యార్థులకు లేని ఇబ్బదులు ఏపీలో ఎందుకు తలెత్తుతాయా.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2020లో 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికెట్స్‌ జారీలో రాష్ట్ర విద్యా శాఖ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఆ తప్పును సరిదిద్దుకోకపోగా మరిన్ని తప్పులు చేసి ప్రజలను కరోనా ముందు నిలబెడుతున్నారన్నారు. కేంద్రం 11వ తరగతి, తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలి అన్నారు. 10వ తరగతి, ఇంటర్‌ ఫస్టియర్ పరీక్షలను తక్షణమే రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విషయంలో ప్రభుత్వ యంత్రాంగాల్లో సన్నద్ధత, ప్రణాళిక తగిన విధంగా లేవు అన్నారు. కరోన సెకండ్‌ వేవ్‌ విషయంలో ప్రజలను మరింతగా అప్రమత్తం చేయలేకపోయాయి. ఫలితంగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతూ మందుల కొరత, ఆక్సిజన్‌ నిల్వలు లేకపోవడం నుంచి ఆసుపత్రుల్లో బెడ్స్‌ కూడా అందుబాటులో లేకుండాపోయాయన్నారు. ఇలాంటి ఆరోగ్య విపత్తు తలెత్తినప్పుడు ప్రభుత్వం మరింత బాధ్యతగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉండగా.. విద్యార్ధులకు పరీక్షలుపెడతాం, తరగతులకు రావాలి, ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు ఇస్తామనడం సరికాదన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking