Header Top logo

రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి కోవిడ్ వ్యాక్సిన్ వెంటనే వేయాలి – రాష్ట్ర అధ్యక్షులు (A.P.J.D.S) మచ్చా రామలింగారెడ్డి

AP 39TV 30 ఏప్రిల్ 2021:

రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అక్రిడేషన్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే కొత్త అక్రిడేషన్లు లేదా వాటిని రెన్యువల్ చేయాలని ఇప్పటికే 5 నెలలు అయింది అని ఇది చాలా అన్యాయమని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.అనంతపురం నగరంలోని R&B గెస్ట్ హౌస్ నందు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై దశలవారీ ఉద్యమం చేస్తామని అన్నారు.సమాచార శాఖ అధికారులు హైకోర్టులో అక్రిడేషన్లు కేస్ ఉందని చెప్తూ అక్రిడేషన్లు కొత్తవి ఇవ్వకుండా పాతవి రెన్యువల్ చేయకుండా జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారని అందుకే ఆ కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ తరుపున హైకోర్టు కేసులో ఇంప్లీడ్ అవుతామని అన్నారు జర్నలిస్టులకు అక్రిడేషన్లు త్వరగా వచ్చేందుకు కృషి చేస్తామని అండగా ఉంటామని మచ్చా తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 56 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోయారని వారికి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వం మంజూరు చేసే 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని అక్రిడేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికి అందజేయాలని డిమాండ్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని జర్నలిస్టులు అందరూ జాగ్రత్తగా ఉండాలని వార్తలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇప్పటికే అమర్నాథ్ లాంటి జాతీయ నాయకుల్ని కోల్పోయి ఉన్నామని మరణించిన వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబసభ్యులందరికీ సంతాపం తెలియజేస్తున్నాము ప్రభుత్వం మరణించిన వర్కింగ్ జర్నలిస్టులందరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మచ్చా కోరారు.రాష్ట్రంలో కరోనా వచ్చిన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తక్షణ సహాయం కింద 30 వేలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలని రామలింగారెడ్డి కోరారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిపెట్టి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారని వారి కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక హాస్పిటల్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కరోనా వారియర్స్ గా గుర్తించి వెంటనే అందరికీ టీక వేసి జర్నలిస్టులను రక్షించాలని వారి కుటుంబసభ్యులందరికీ కూడా వ్యాక్సిన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తున్నదని మచ్చా అన్నారు.అనంతపురం నుంచి పెద్దఎత్తున ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రతి జర్నలిస్టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికలు, ఫోటోగ్రాఫర్లు సీనియర్ జర్నలిస్టులు అందరూ జర్నలిస్టు ఉద్యమంలో పాల్గొనాలని అందరూ సహకరించాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమాన్ని రూపకల్పన చేస్తున్నామని అక్రిడేషన్లు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు, జర్నలిస్టు ఇన్సూరెన్సు తదితర సమస్యలపై జర్నలిస్టులను చైతన్యవంతుల్ని చేసి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ పోరాడుతుందని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.విలేకర్ల సమావేశంలో అనంత జనశక్తి దినపత్రిక సంపాదకులు వెంకటేశులు, విజయరాజు, భాస్కర్ రెడ్డి, శివ ప్రసాద్, రాజా ఆంధ్రప్రభ, బాలు, జానీ, షాకీర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking