Header Top logo

కాళీ స్థలాలు శుభ్రం చేయకుంటే ఫెనాల్టీ లు విధిస్తాం – నగర మేయర్ మహమ్మద్ వసీం.

AP 39 TV 30ఏప్రిల్ 2021:

నగరంలో ఇళ్ల మధ్య ఉన్న కాళీ స్థలాలు వాటి యజమానులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని శుభ్రం చేయకుంటే ఫెనాల్టీ లు విధిస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం హెచ్చరించారు.శుక్రవారం నగరంలోని 49,50 వ డివిజన్ల లో కార్పొరేటర్ లు ముని శేఖర్ల లతో కలిసి మేయర్ వసీం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా డివిజన్ లలో ఇళ్ల మధ్య కాళీ స్థలాలలో ముళ్ల కంపలు పెరిగి పారిశుద్ధ్య సమస్య ఏర్పడటంతో పాటు పందులు ఎక్కువగా ఉంటున్నాయని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించిన మేయర్ వసీం కాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.అదే విధంగా ఆయా డివిజన్ల లలో డ్రైనేజీ కాలువలు సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కాలువలు శుభ్రం చేసే పరిస్థితి లేదని స్థానికులు మేయర్ కు వివరించారు.కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా మేయర్ కోరారు.ఆయా డివిజన్ల లలో కార్పొరేటర్ లతో పాటు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై మేయర్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమణా రెడ్డి,టౌన్ ప్లానింగ్ అధికారులు రామలింగేశ్వర్ రెడ్డి,అలివేలమ్మ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking