Header Top logo

Telugu is great తెలుగు గొప్ప తనం (కవిత్వం)

Telugu is great

“తెలుగు గొప్ప తనం”

పొగడరా మన తెలుగుతల్లిని…
పాడరా మన తెలుగుపాటని…
నిలుపరా ఈ తెలుగుమాటని…
పలకరా నీ నోట తెలుగుని…
అమ్మపాట కమ్మనైన తేనెఊటని…

పుట్టింది ఈ మట్టిలోనే…
మన భాష పెరిగింది ఈ గడ్డపైనే…
నిలిపింది అందరిలో తెలుగు తేజాన్ని…
ప్రేమ వలికింది తెలుగుమానవత్వాన్ని
అందరిని కదిలించి నోరూరించే తెలుగుపాట అనురాగమై పలికింది అందరినోట…
తల్లిరుణం తీర్చుకో!!
తెలుగులో మాట్లాడి..
గళంవిప్పి పాటపాడు..
అమ్మభాషలోనే!!
అమ్మ పొత్తిళ్లలో పురుడు పోసుకున్న
మధురమైన మన మాతృభాషలో…

ఏ ప్రదేశములో ఉన్నాగాని
తెలుగుభాష గొప్పతనమే తెలుపరన్న…
నిన్ను మోసిన తల్లి కన్నా…
నీకు మాటఇచ్చిన తెలుగు మిన్న…
తెలుగుతోనే తెలివి తెచ్చుకో…
తెలుగే ఒక మూలధనంగా మలుచుకో!
నీడనిచ్చి..నిద్రపుచ్చి..బతుకునిచ్చి
బాధలను తీర్చిందిరా…
తెలుగేరా అస్తిత్వం!!…
తెలుగేరా వ్యక్తిత్వం!!…
సర్వకళల సృష్టికర్త తెలుగేరా!!…

ఏ దేశములో భాష పుట్టకముందే…
వినిపించే మన నేల తెలుగుతోనే…
ద్వేషాలు మోసాలు తెలియని తెలుగు
స్నేహదీపాలు వెలిగించు తెలుగింటిలోనే…

పసిడిపూల కలల వెలుగు మనభాష..
రత్నదీపాలవెలుగు మన తెలుగు..
కలలన్నీ కళ్లలో కాంతిరూపాలై రాలు..
కొలవలేని వెలుగును నింపుకున్న తెలుగు…
మనసులో మమకారం ఒదిగిన తెలుగు…
ఆత్మీయదృశ్యమై అల్లుకున్న తెలుగు!!

త్యాగయ్య నాదమై వెలిగిన తెలుగు…
జాలువారిన తేనె తెలుగుదనము…
అన్నిభాషలందు తెలుగు గొప్ప…
తెలుగులోగిళ్లలో తెలివి కాంతులే..
తెలుగింటి గుమ్మాలకు..
వెలుగుకాంతులే!!…
తెలుగుపొత్తిళ్లలో పుట్టిన మనము…
అమ్మ ఉగ్గు పాలతో పెరిగినాము..

ఎన్నిచరిత్రలు ఉన్నా గాని…
తెలుగువెలుగే గొప్ప గాని…
ఎన్నిజాతులు ఉన్నా గాని…
మన తెలుగుజాతే గొప్పది!!…

ఏ భాషలో లేని తీపి…
తెలుగుభాషలో తీపెక్కువ…
కమ్మని మధురమై భావమున్న
నవరసాల తెలుగుజిలుగు!!…

ప్రకృతి అందాల సొగసు నిండు…
తెలుగువారి మనసులో ప్రేమనిండు..
తెలుగువారి మోములో తేజముండు..
విరిసిన ఎద పరిమళాల తెలుగునిండు!

వీరిని కనిపెట్టే కాలం రాదా!!?? వీరి పని పట్టే ధైర్యం లేదా!!?? ముసుగులతోమోసం చేసి... లొసుగులతో లూటిచేసి దగాకోరుల దొంగలెందరో!!??... వారిని పసికట్టండి!! పనిపట్టండి!!.. ఇలాంటి దగుల్బాజీలు ఉన్నన్నాళ్ళు లేదు మనకు సుఖం...

అంబటి నారాయణ
నిర్మల్, 849326801

అంతర్జాతీయ
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

Leave A Reply

Your email address will not be published.

Breaking