రంజాన్ నెలవంక పొడిచింది…!!
‘ఈద్ కా చాంద్ ‘ ముబారక్.!!
రంజాన్ నెలవొంక పొడిచింది..’ఈద్’ కు తలు
పులుతెరుచుకున్నాయి.”ముబారక్” అంటూ సంతోషాలు మిన్నుముట్టాయి.
రంజాన్ నెలంతా ఉపవాసాలు(Roja)తో దీక్ష పాటించిన ముసల్మానులకు మాసాంతం ఆకా
శంలో పొడిచిన నెలవంకతో ఉపవాసం దీక్ష పూర్తవుతుంది.నెలంతా తమదీక్షకు సహకరిం
చిన అల్లాః కు కృతజ్ఞతలు తెలుపుతూ…..
ఆ మర్నాడే పండుగ (ఈద్ )జరుపుకుంటారు!!
రంజాన్ పండుగ గురుంచి డా. రవూఫ్
(గుంటూరు) ఓ మంచి కవిత రాశారు..
వివరాలు తెలుసుకునే ముందు మీరూ
ఓ సారి ఈ కవిత చదవండి..
“వో మెలిపడిన ట్వైన్ దారానికి మల్లే….
వొక నిమిషం కదలాడి మటుమాయ
మౌతాడు నెలపొడుపు చంద్రుడు…
చిర్నవ్వు లాంటి రేఖామాత్రపుఅల వలె
ఆకాశపు పెదవులపైన యెగసి తెగిన
ఆ దారపు కొసన తళుకు లీనుతుంటుంది తారాగుచ్ఛం !
రంజాన్ నెలవంక నిజానికొక
దాహార్తి యెడారి నౌక
వో కటిక పేద క్షుద్బాధాతిరేక కేక !
నెల పొడుగుతా ….
దప్పికని ఆకలిని అణచి వుంచి
ఆణువణువునా సహిష్ణుతని
సహానుభూతిని అనుభవానికి
అందిస్తాడు నీకు
నెలపొడుపు చంద్రుడు.
మళ్ళీ….
చంద్రుడు నెలవంకై హసిస్తాడు
అంతట
రంజాన్ పండుగ ఆగమిస్తుంది
ఖీర్ తీయదనమొక్కటేనా?
జీవితం లోని షడ్రుచులూ
నీ కనుభూతమౌతాయి “!!
*డా. రవూఫ్..!!
రంజాన్ మాసం చివరలో పొడిచే నెలవొంక
వో మెలిపడిన ట్వైన్ దారానికి మల్లే సన్నగా వుందట.అంత సన్నని రేఖలా ఆకాశంలో”వొక
నిమిషం కదలాడి మటుమాయమౌతాడు..
నెలపొడుపు చంద్రుడు.ఇది అందరిఅనుభవం
లోని విషయమే..నెలపొడుపు 🌙 చంద్రుడ్ని సన్ననిటైన్ దారం తో పోల్చడం కవి ప్రతిభకు మెచ్చుతునక.
ఇక ఆ సన్నని నెలవొంక చిర్నవ్వు లాంటి రేఖామాత్రపుఅలలొ ఆకాశపు పెదవులపైన యెగసి తెగిన ఆ దారపు కొసన తళుకులీను
తోందట తారాగుచ్ఛం.అందమైన అనుభవాని
కి..అంతే అందమైన పోలిక.అందమైనభావన.
రంజాన్ నెలవంక నిజానికొక దాహార్తి.రంజాన్ మాసమంతా కఠోర ఉపవాసాలతో దీక్ష వహిం
చిన ముసల్మానులకు నెలపొడుపు ఓయెడారి
నౌక వో కటిక పేద క్షుద్బాధాతిరేక కేక’అంటా
డు కవి.నెల పొడుగుతా దప్పికని ఆకలిని
అణచి వుంచిఆణువణువునా సహిష్ణుతని సహానుభూతిని అనుభవానికి అందిస్తాడు
ఈ నెలపొడుపు చంద్రుడు.
ఈరోజు ఆకాశంలో చంద్రుడు నెలవంకై హసిస్తాడు..అప్పుడు రంజాన్ పండుగ ఆగమిస్తుంది.
రంజాన్ పండుగ అంటే,ఖీర్ (షీర్ ఖుర్మా)తీయ
దనమొక్కటేకాదు..జీవితంలోని షడ్రుచులూ అనుభూతమౌతాయి….!!
రవూఫ్ భాయ్ కు,మరియు మిత్రులందరికీ
‘ఈద్ కా చాంద్ ‘ ముబారక్.!!
ఎ.రజాహుస్సేన్..!!