ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021:
జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ధర్మవరం డివిజన్ తాడిమర్రి మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఆదేశాలతో అనంతపురం దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తూ ఈ కవాతు సాగింది. పలువురు పోలీసు అధికారులు, పోలింగ్ బందోబస్తు పోలీసు సిబ్బంది & గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.