Header Top logo

నలుపై ఆరేళ్లైనా శ్రీనివాస్ రెడ్డిని మరిచి పోలేని..

ప్రజల కోసం పని చేస్తే శాశ్వతంగా వారి హృదయాలలో ఉంటరానడానికి గడ్డం శ్రీనివాస్ రెడ్డి జీవితం నిదర్శనం. ప్రజలకు సేవాలు అందించాలని పట్టుదలతో శతృవుకు భయ పడకుండా తాను నమ్మిన పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ప్రాణాలు పోగొట్టున్నారు రెడ్డి.

ఔను.. మీరు చదువుతున్నది నిజమే. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యర్థులు 27 మే 1976లో హత్య చేశారు. హత్య చేసిన తరువాత పోలీసులకు సాక్ష్యాలు దొరుకద్దని భావించిన నిందితులు హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీం పట్నం చెరువులో పడేసి వచ్చారు.

ఆ తరువాత పోలీసులు విచారణ చేపట్టి మృతదేహంను కనుగొన్నారు. శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసిన నిందితుడు విజయ్ కుమార్ రెడ్డి కొంత కాలం జైల్ శిక్ష అనుభవించి ఆ తరువాత విడుదల అయ్యారు.

అంటే.. నలుపై ఆరు సంవత్సరాల క్రితం  గడ్డం శ్రీనివాస్ రెడ్డి హత్యకు గురైనా కేశపల్లి గ్రామ ప్రజలు మాత్రం అతనిని మరిచి పోలేక పోతున్నారు. పక్కనే ఉన్న పడకల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి తమ గ్రామస్థులకు సహాయం చేసారని మరణించిన తరువాత శ్రీనివాస్ రెడ్డి విగ్రహంను నడి ఊళ్లో ఏర్పాటు చేసి అతనిని భక్తితో కొలుస్తుంటారు.

శ్రీనివాస్ రెడ్డి జయంతి.. వర్ధంతితో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఆగష్టు 15 మరియు రిపబ్లిక్ డే 26 జనవరి రోజున శ్రీనివాస్ రెడ్డి విగ్రహనికి పూల దండ వేసి కేశపల్లి గ్రామస్థులు నివాళులు అర్పిస్తారంటున్నారు గ్రామ సర్వసమాజ్ అధ్యక్షులు యాటకర్ల దేవేష్.

రిపబ్లిక్ దినోత్సవం స్వర్గీయ గడ్డం శ్రీనివాస్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో సర్పంచ్ మైదం మహేశ్వర్, ఎంపీటీసీ మున్నూర్ గంగాధర్, మాజీ సర్పంచ్ మాసం చిన్న రామాగౌడ్, ముదిరాజ్ పెద్దమ్మ దేవాలయం కమిటీ సభ్యులు యాటకర్ల శ్రీధర్, యాటకర్ల క్రాంతి, యాటకర్ల శ్రీనివాస్, సాలూర్ నరేందర్, ఈర్ల రాజు, ఎర్రొల్ల హరీష్, ఎర్రొల్ల ప్రశాంత్, ఈర్ల సాయిలు, యాటకర్ల మహేందర్ మరియు కారోబరి భూమన్న, చెందగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం ఆత్మచరణ్ రెడ్డి తండ్రియే స్వీర్గీయ గడ్డం శ్రీనివాస్ రెడ్డి. 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking