Header Top logo

ఆహాలో పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్​ ప్రోమో రిలీజ్

సినీ హీరో అంటే ప్రేక్షలలో అదో మోజు.. ఇష్టమైన హీరో ఇంటార్వ్యూ వచ్చిందంటే ఆ హెప్పినెస్ వేరు. ఇగో..  నటసింహం బాలకృష్ణ, పవర్​ స్టార్​ ఫ్యాన్స్​ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్​బీకే అన్​స్టాపబుల్​ పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్​ ప్రోమో వచ్చేసింది. అందులోని డైలాగ్ ఇదే..

ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా?.. బాలయ్య సూటి ప్రశ్నకు పవన్​ జవాబు…

– ఇందులో బాలయ్య, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో

ఈ టాక్​ షో సీజన్‌-2లో ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు గెస్ట్​లుగా వచ్చారు.

బాలయ్యతో సరదా, ఆసక్తికర సంభాషణలు సాగించారు.

కాగా, ఈ షోకు ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చారు.

త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ ఎపిసోడ్​ను రెండు పార్ట్​లుగా ప్రసారం చేయనున్నారు.

ఈ క్రమంలో ఆహా ప్లాట్​ఫామ్​ పవన్​కల్యాణ్​ ఎపిసోడ్​ పార్ట్​-1 ప్రోమోను విడుదల చేసింది.

ఇప్పుడు విడుదలైన ప్రోమోలో బాలకృష్ణ, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు.

అందులో పవన్ కల్యాణ్​​ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.

దానికి అదే రీతిలో పవన్​ కల్యాణ్ సమాధానమిచ్చారు.

ఈ ప్రోమో పవన్‌ కల్యాణ్​ ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది.

ఈ ఎపిసోడ్ ఎప్పుడు​ స్ట్రీమింగ్ కానుంది అనే విషయం ఇప్పటివరకు ఆహా అధికారికంగా ప్రకటించలేదు.

సీజన్ 2 చివరి ఎపిసోడ్​గా పవన్ కల్యాణ్​ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఫిబ్రవరి రెండో వారంలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

దీనికి తోడు ఆహా ప్లాట్​ఫామ్​, ‘బాప్​ ఆఫ్​ ఆల్​ ఎపిసోడ్స్’​ అంటూ పవన్​ ఎపిసోడ్​పై అంతకంతకూ అంచనాలు పెంచుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking