Header Top logo

మత్స్య కార్మికులను వృత్తికి దూరం చేసే..

మత్స్య కార్మికులను వృత్తికి దూరం చేసే ప్రయత్నం

చిన్న చిన్న అంశాలతో ఇబ్బందులు

చిన్నచిన్న అంశాలను చూపుతూ ముదిరాజ్ మత్స్య కార్మికులను వృత్తికి దూరం చేయాలనే ప్రయత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు పిలుపునిచ్చారు.

హైదరాబాదులోని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కార్యాలయంలో బుధవారం ముదిరాజ్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. న్యాయవాదులు అర్జున్ ముదిరాజ్, చంద్రశేఖర్ ముదిరాజ్, కొట్టల యదగిరి ముదిరాజ్, వేదవికాష్ ముదిరాజ్ పాల్గొనగా, 1964లో ప్రభుత్వం ముదిరాజులను మత్స్య కార్మికులుగా గుర్తించిన నాటునుండి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుండగా అక్కరకులేని అంశాలను పనికిరాని విషయాలను లేవనెత్తు గౌరవ న్యాయస్థానం ద్వారా ముదిరాజులకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం సరియైనది కాదని వాటిపై పూర్తిస్థాయిలో న్యాయపరమైన అంశాలను పరిశీలించి ఒకటికి రెండుసార్లు చర్చించి సమర్థవంతంగా గౌరవ న్యాయస్థానంలో ముదిరాజుల పక్షాన తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని న్యాయవాదులను కోరారు.

నిజామాబాద్ జిల్లా గంగ పుత్రులు ముదిరాజులు చేపలు పట్టుకునే హక్కు లేదని తమదే చేపలు పట్టుకునే వృత్తి అని ఆ జాబితా నుండి ముదిరాజులను తొలగించాలని గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. 1964 లో తీసిన జీవో 98 లో బెస్త సామాజిక వర్గంతో పాటుగా ముత్తిరాశి, తెనుగ సామాజిక వర్గాలు చేపలు పట్టుకునే వృత్తిపై ఆధారపడి ఉందని వీరికే హక్కులు ఉన్నాయని 98 జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నాటి నుండి తెలంగాణలో ముదిరాజ్ మత్స్యకార్మికులు సుమారు నాలుగు లక్షలకు పైగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరిని వృత్తి నుండి తొలగించే కుట్ర చేయటం పై న్యాయ నిపుణులతో ముదిరాజు న్యాయవాదులతో చర్చించడం జరిగింది.

2011లో గంగపుత్ర సామాజిక వర్గాన్ని చేర్చగా 2022లో ముదిరాజు సామాజిక వర్గము కూడా మద్రాసి తెలుగు అన్ని ఒకే కులం కాబట్టి ముదిరాజులను కూడా చేర్చడం జరిగింది. నాటినుండి ఒకే వృత్తిలో కొనసాగుతున్న మత్స్య కార్మిక సామాజిక వర్గానికి చెందినవారు కుట్రతో గౌరవ హైకోర్టులో కేసు వేసిన దానిపై స్పష్టమైన విధానంతో గౌరవ కోర్టులో కేసును కొనసాగించి ఎదుర్కోవాలని డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు గారు న్యాయవాదులను కోరినారు.

1/70 చట్టం ఉన్న ప్రాంతంలో ముదిరాజ్ మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపై కూడా న్యాయపరమైన అంశాలను పరిశీలించి, సవరణ 6 జీవోను రద్దు చేయుటకు కూడా చర్చించి గౌరవ హైకోర్టు లో కేసు వేయుటకు చర్చించడం జరిగింది.

ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ సలహాదారులు పిట్టల రవీందర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, బల్ల సత్తయ్య ముదిరాజ్, అల్లుడు జగన్ ముదిరాజ్, బొమ్మకంటి సైదులు ముదిరాజ్, తదితరులు పాల్గొనగా ప్రభుత్య న్యాయవాదిగా నియమించబడిన పాండు ముదిరాజ్ ను సన్మానించడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking