Header Top logo

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:

జిల్లా వ్యాప్తంగా నాలుగు దశలలో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బుసారపు సత్య ఏసుబాబు ఐపీఎస్, వారి ఆదేశాల మేరకు కదిరి డి.ఎస్.పి శ్రీ ఎస్ .భవ్య కిషోర్Apps , కదిరి రూరల్ సీ.ఐ T. మధు , పర్యవేక్షణలో, తనకల్లు ఎస్సై మరియు సిబ్బంది అందరూ కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా పక్కా రాబడిన సమాచారం మేరకు తనకల్లు మండలం, పెద్దపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తుండగా వారిని అరెస్టు చేసి విచారించగా , విచారణలో భాగంగా తనకల్లు మండలం, చీకటి మాన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పూతల భాగ్యమ్మకు, ఇద్దరు ముద్దాయిలు మద్దతు తెలిపి ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. మరియు ఈ ఎన్నికలలో ఎలాగైనా సరే గెలవాలని ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభాలకు పెట్టేందుకు, వారికి మద్యం పంపిణీ చేసేందుకు కర్ణాటక నుండి అక్రమంగా మధ్యాన్ని కొని వాటిని తమ స్వగ్రామానికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ వివరాల మేరకు అరెస్టయిన ముద్దాయిల పేర్లు ఎద్దుల రెడ్డి శేఖర్ రెడ్డి, వయసు 40 సంవత్సరాలు, తండ్రి రామిరెడ్డి, పెద్ద ఎద్దుల పల్లి గ్రామం, చీకటి మాన్ పల్లి పంచాయతీ,‌ తనకల్లు మండలం, మరొకరు కొట్టం గిరిబాబు పై ఇద్దరు ముద్దాయిల మీద మరియు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టువంటి తనకల్లు మండలం చీకటి మాన్ పల్లి గ్రామానికి చెందిన కూతల భాగ్యమ్మ పైన తనకల్లు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking