ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:
కనేకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమ రవాణా నిరోధించడానికి శుక్రవారం రోజున స్పెషల్ ఇన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని బొమ్మనహల్ మండలం లోని గోవిందవాడ క్రాస్ వద్ద దాడులు చేయగా గోవిందవాడ గ్రామానికి చెందిన కొలాట్ల రవి అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన Haywards,cheers,whisky, 90 ml టెట్రా ప్యాకెట్స్ 2 బాక్సుల యందు 192 ప్యాకెట్స్ ను తీసుకుని వస్తుండగా సదరు వ్యక్తిని అరెస్టు చేసి తన వద్ద ఉన్న రెండు బాక్స్లు ను 192 టెట్రా ప్యాక్స్ ను సీజ్ చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేసి రాయదుర్గం Jfcm కోర్టులో ప్రవేశపెట్టగా ఆ వ్యక్తిని 14 రోజులు రిమాండ్ కు తరలించాలని జడ్జి ఆదేశించారని సెబ్ C.I. సోమశేఖర్ తెలియజేశారు. ఎవరైనా అక్రమ మద్యం గాని, నాటుసారా గాని కఠిన చర్యలు తీసుకుని po Act నమోదు చేయడానికి వెనుకాడమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ C.I. సోమశేఖర్, S.I. వీరస్వామి,HC J. సోమశేఖర్ నాయక్ ,pc మారుతి ప్రసాద్, మల్లికార్జున ,నరసింహులు, మరియు సువర్ణ పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,