రెండవ విడత పోలింగ్ విధుల్లో భాగంగా కళ్యాణదుర్గం డివిజన్లో బందోబస్తుకు సమావేశం నిర్వహించిన – జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు IPS
ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లాలో రేపు జరగనున్న రెండవ విడత పోలింగ్ విధుల్లో భాగంగా కళ్యాణదుర్గం డివిజన్లో బందోబస్తుకు వెళ్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS సమావేశం నిర్వహించారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశానిర్దేశం చేశారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ , కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.