ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021:
బుక్కరాయసముద్రం మండలం చెదుళ్ల గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నారశిన్ని శ్రీనివాస రెడ్డి. టిడిపి తరఫున బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేనందున తిరస్కరించడం జరిగింది. మిగిలిన ఒక అభ్యర్థి విత్ డ్రా కావడం వల్ల శ్రీనివాస్ రెడ్డి గెలుపు అనివార్యమైంది. శ్రీనివాస్ రెడ్డి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవం కావడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు.