AP 39TV 13 మార్చ్ 2021:
రాప్తాడు నియోజకవర్గంలో మహోత్తర ఘట్టానికి తెరదీశారు. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చారు. రైతుల్లో ఆనందం నింపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నాగలమడక చెరువుకు.. అక్కడి నుంచి పేరూరు డ్యాంలోకి నీరు చేర్చడంలో ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రెండు రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర నాగలమడకలో ప్రారంభమైన పేరూరులో ముగిసింది.జలహారతి ఇచ్చి
పాదయాత్ర ముగింపు సందర్భంగా పేరూరు డ్యాంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి శంకర్‌నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా గంగపూజ చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రశంసించారు. ఎన్నో ఏళ్లుగా నీటిబొట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కల సాకారం చేసిందని పేర్కొన్నారు.