Header Top logo

గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలి,కౌన్సిలర్ అభ్యర్థుల సమావేశంలో- డిఎస్పీ భవ్య కిషోర్

AP 39TV 13 మార్చ్ 2021:

మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో కదిరి మున్సిపల్ కమిషనర్ చిన్నోడు, డీఎస్పీ భవ్య కిషోర్ , టౌన్ సి.ఐ రామకృష్ణ ప్రత్యేక సమావేశమయ్యారు. ఈనెల 14 న జరుగనున్న కౌంటింగ్ నేపథ్యంలో అభ్యర్థులకు నియమ నిబంధనలు తెలియజేశారు. కౌంటింగ్ సెంటర్ వద్దకు ఒక అభ్యర్థి + ఒక ఏజెంట్ (మొత్తం ఇద్దరు) వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు (Cellphones, Calculators etc., ) లు తీసుకొని కౌంటింగ్ సెంటర్ లోనికి రాకూడదన్నారు.కౌంటింగ్ సెంటర్ మొత్తం CC Camera ల నిఘాలో వుంటాయన్నారు.30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్లు అమలులో ఉన్నందున జనాలు గుంపులు, గుంపులు గా తిరుగరాదన్నారు. అభ్యర్థులు గెలుపోటములు సమానముగా భావించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావివ్వకుండా సంయనము పాటించాలన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు/ ఏజెంట్ లు ఇతర అభ్యర్థులు/ ఏజెంట్ లతో ఎలాంటి వాగ్వివాదాలకు దిగారాదని.. ఏవైనా సందేహాలు వుంటే సంబంధిత R.O తో సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking