Header Top logo

పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన-ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

AP 39TV 13 మార్చ్ 2021:

శింగనమల మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి  మరియు ఎమ్మెల్సీ శమంతకమణి .అనంతరం వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి  మరియు డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి  మాట్లాడుతూ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ప్రశంసించారు.10 సంవత్సరాల పాటు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దేవుని ఆశీస్సులు ప్రజల దీవెనల వల్ల జగన్ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అని గుర్తు చేసుకున్నారు.అంతేకాకుండా ప్రజా సంకల్ప పాదయాత్ర లో చెప్పిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నారని, దాదాపు 90% సంక్షేమ పథకాలు అమలు చేశారని గత ప్రభుత్వం లాగా మోసపూరిత హామీలు ఇవ్వలేదని మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లు చేసి చూపించారని గుర్తు చెప్పారు. అలాగే 10 సంవత్సరాల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు. అందరి సహాయ సహకారాలతో శింగనమల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్వన్ గా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామంలో వెలిసిన అవధూత శ్రీ శ్రీ శ్రీ చితంబర స్వామి తిరునాళ్ళలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరునాళ్ళలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking