AP 39TV 31మార్చి 2021:
అనంతపురం నగర పాలక సంస్థ నూతన మేయర్ మహమ్మద్ వసీం సలీం డివిజన్ల పర్యటనలు సత్పలితమిస్తున్నాయి. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ డివిజన్ లలో స్థానిక కార్పొరేటర్ లు నాయకులు, అధికారులతో కలిసి డివిజన్ల లలో పర్యటించి స్థానికులు నుండి సమస్యలు అడిగి తెలుసుకుని ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులను అడిస్తున్నారు. ఇటీవల మేయర్ మహమ్మద్ వసీం సలీం అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించగా మరువ వంక కాలువలో పూడికతీత పేరుకుపోయిన విషయాన్ని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తాను అని ఇచ్చిన మాట మేరకు మంగళవారం పూడికతీత పనులు ప్రారంభం కాగా మేయర్ మహమ్మద్ వసీం సలీం పనులను పరిశీలించారు.మేయర్ మహమ్మద్ వసీం సలీం పర్యటనలో అధికంగా పారిశుద్ధ్య సమస్యలు వస్తుండటంతో మేయర్ ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్ యంత్రాంగం సైతం ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తోంది. దీనితో ప్రజలు మేయర్ మహమ్మద్ వసీం సలీం పర్యటనతో తమ సమస్యలకు పరిష్కారం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.