Header Top logo

తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తు

అనంతపురం జిల్లాలో రేపు జరగనున్న మూడవ విడత పోలింగ్ విధుల్లో భాగంగా తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తుకు వెళ్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ఈరోజు తాడిపత్రి పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS సమావేశం నిర్వహించారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో దిశానిర్దేశం చేశారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ , కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీఎస్పీ చైతన్య, భవ్య కిషోర్ , తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking