ఏపీ 39 టీవీ న్యూస్
ఫిబ్రవరి 16
గుడిబండ:- గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ముఖ్య గమనిక…
–జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేయకూడదు. గొడవ, హింస, అల్లర్లు, వాగ్వాదాల వదంతులను ప్రచారం చేయకూడదు సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి రెచ్చగొట్టే పోస్టులు పోస్టు చేయకూడదు. ప్రచారం, తదితర పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలి
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులెదురైనా తక్షణమే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలి.
పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు ఉంటాయని స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తిచేశాం అని ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ తెలిపారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv news
గుడిబండ