AP 39TV 18ఫిబ్రవరి 2021:
గుడిబండ: మండలంలోని మోరబాగల్ గ్రామంలో లో విధులు నిర్వహిస్తున్నటువంటి తలారి హనుమంతరాయప్పs/o అంజినప్ప
గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. విషయం తెలుసుకున్న గుడిబండ తహసిల్దార్ మహబూబ్ పీరా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి, విఆర్ఓ నరసింహమూర్తి మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి రెవిన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దహన సంస్కారం కోసం 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు మంజు ,గోవిందప్ప,రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tvన్యూస్
గుడిబండ