Header Top logo

కామారెడ్డి పట్టణ బంద్ ప్రశాంతం

పోలీసు నిర్బంధం మధ్య కొనసాగుతున్న బంద్

  • జై జవాన్ జై కిషన్ అంటూ రైతుల నినాదాలు.. 
  • మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నినాదాలు..
  • బైక్ ర్యాలీ తీసిన రైతుల అరెస్ట్
  • కామారెడ్డికి  బీజేీపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 
  • కలెక్టర్ తీరుపై రైతుల ఆగ్రహం   
  • కేటీఆర్ స్పందన కరువు.. బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు మైలేజ్.. 
  • తెలంగాణ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామంటున్న రైతులు

కామారెడ్డి రైతులు తమ ఆందోళన మరింతా ఉదృతం చేస్తున్నారు.

శుక్రవారం కామారెడ్డి పట్టణ బంద్ కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపును ఇచ్చింది.

ఈ బంద్ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసి రైతులకు మద్దతు ప్రకటించాయి.

అయితే.. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. 

రైతులను అరెస్టు చేస్తున్న పోలీసులు

బంద్ ను రైతులు – పోలీసులు చాలేంజ్ గా తీసుకున్నారు. కామారెడ్డి టౌన్  బంద్ కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు ఇవ్వడంతో రైతులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు.  హిాంసత్మక సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి టౌన్ లోకి వచ్చే రోడ్ ల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. 

ఈ బంద్ కు రాజకీయ రంగు..

కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ తో ఇచ్చిన పట్టణ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జన సమితితో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. బంద్ ను విచ్చిన్నం చేయడానికి పోలీసులు ముందు జాగ్రత్తగా పొలిటికల్ లీడర్ లను అదుపులోకి తీసుకున్నారు. 

  • న్యూస్ ఎజెన్సీ

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking