Header Top logo

అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ

అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ

తెలంగాణ తరహా పాలన కోరుకుంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు

-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

నిజామాబాద్: ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

ఇక్కడి సంక్షేమాభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ తరహా పాలనను కోరుకుంటున్నారని మంత్రి అన్నారు.

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం కేసీఆర్ పాలనను స్వాగతిస్తూ ఆయన నాయత్వాన్ని కోరుకుంటున్నారని, ఇది తెలంగాణలో సంక్షేమ పాలనకు అద్దం పడుతోందన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సుమారు 13.50 కోట్ల రూ. విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భీంగల్ మండలం జగిర్యాల్ గ్రామంలో రూ. 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ కు, రూ. 40 లక్షలతో జాగిర్యాల్ నుండి కుప్కాల్ తండా వరకు బిటి రోడ్ పునరుద్ధరణ పనులకు, రూ. 1.50 కోట్లతో కుప్కాల్ నుండి భీంగల్ వయా గెస్ట్ హౌస్ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, రూ. 1.60 కోట్లతోకుప్కాల్ నుండి దోన్పాల్ రోడ్ పునరుద్ధరణ పనులకు, రూ. 20 లక్షలతో బెజ్జోరాలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి, బెజ్జోరా నుండి లింగాపూర్ చౌట్ వరకు రూ. 1.60 కోట్లతో బిటి రోడ్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు జరిపారు. వేల్పూర్ మండలం పడగల్ నుండి పోచంపల్లి వరకు రూ. 95 లక్షలతో బిటి రోడ్ మరమ్మత్తుల పనులకు, లాక్కోరా లో రూ. 20 లక్షలతో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా రూ. 7 కోట్లతో నూతనంగా నిర్మించిన SWC (స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్) 10000 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ ను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking