AP 39TV 02మార్చ్ 2021:
కనేకల్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సెబ్ స్టేషన్ కనేకల్ మండలం లోని పలు గ్రామాల్లో దాడులు జరపగా మాల్యం గ్రామానికి చెందిన కురుబ నాగరాజు s/o K. పకీరప్ప వద్ద 34 Haywards,cheers,whisky, 90 ml టెట్రా ప్యాకెట్స్ పట్టుబడ్డాయి. అనంతరం ఆ ముద్దాయిని అరెస్టు చేసి రాయదుర్గం JFCM కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించాలని ఆదేశించారు. అదేవిధంగా కనేకల్ మండలం యందుగల పాత ముద్దాయిలను పిలిపించి మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మ రాదని, అక్రమ మద్యం తరలించ రాదని ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని సి.ఐ. డి. సోమశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనేకల్ సెబ్ సి. ఐ. డి. సోమశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.