Header Top logo

విశాఖ ఉక్కు పరిరక్షణకై విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

AP 39TV 02మార్చ్ 2021:

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కొరకు మార్చి 5వ తేదీన వామపక్షాలు చేపట్టనున్న రాష్ట్ర బందుకు మద్దతు తెలుపుతూ మంగళవారం నాడు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏ ఐ డి ఎస్ ఓ, టిఎన్ఎస్ఎఫ్, ఏ ఐ వై ఎఫ్, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ఎన్జీవో హోం నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు మనోహర్, సూర్య చంద్ర, ఏ ఐ డి ఎస్ ఓ మహేష్, టిఎన్ఎస్ఎఫ్ లోకేష్, ఏ ఐ వై ఎఫ్ మన్సూర్, ఏఐఎస్ఎఫ్ రమణయ్య, మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు, అందులో భాగంగానే మార్చి 5వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ కు మద్దతుగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ బంద్ కు విద్యార్థులు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించి బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటికే ఏపీ ప్రజలను నట్టేట ముంచిందని మరల ఏపీ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించాలన్న నిర్ణయం దుర్మార్గమైనదని అన్నారు, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కొరకు అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరం అన్నారు, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు, ఈ నెల 5న జరిగే బందులో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పాల్గొనాలని డిమాండ్ చేశారు, అనేకమంది ప్రాణ త్యాగాలతో మరియు పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని కోరారు, ఈ నెల 5న జరిగే బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, బందు జయప్రదం కొరకు మూడవ తేదీన కార్మిక, విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకులు కృష్ణ, నగర నాయకులు మోహన్, మంజు, రజినీకాంత్, ఎస్ఎఫ్ఐ నాయకులు విజయ్, వినయ్, ఏఐవైఎఫ్ నాయకులు దేవా, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking