Header Top logo

బీజేపీ గెలుపుకు హుజూరాబాద్ నాయకులే పునాది

రేపటి భారతీయ జనతా పార్టీ గెలుపునకు హుజూరాబాద్ నాయకులే పునాది కానున్నారని పేర్కొన్నారు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్.

మనిషికి పదవిని బట్టి గౌరవం దొరకదని.. చేసే పనిని బట్టి గౌరవం దొరుకుతుందన్నారు.

నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

దేశంలో మొదటి సారిగా బీజేపీ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది.. దీనిని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.

బాధలు ఉన్నప్పుడు కుంగిపోవద్దని.. పదవులు ఉన్నప్పుడు పొంగిపోవద్దన్నారు. తాను ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో.. ఇప్పుడు అలానే ఉన్నానని అన్నారు.

రేపు కూడా అలానే ఉంటానని చెప్పారు.

‘నాకు సినిమాలు చూసే అలవాటు లేదు.. మందు తాగను. ప్రజలను కలవడం నాకున్న అలవాటు. అదే నాకు సంతోషం. వారి సమస్య తీర్చడమే అన్నిటికంటే నాకు గొప్ప అనుభూతి.

సమస్యలు ఉన్న ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా మనం అభాగ్యులకు మద్దతుగా నిలబడాలి.

ధరణి వల్ల నష్టపోయిన రైతుల అప్లికేషన్లు తీసుకోండి. వారి తరపున మనం కొట్లడుదాం. కేసీఆర్ పాలన కొనసాగడం పేదప్రజలకు అరిష్టం. మళ్లీ గెలిస్తే చావులు, అణచివేత, హింసించడం తప్పదు

Leave A Reply

Your email address will not be published.

Breaking