గుడిసె వాసులకు న్యాయం చేయాలని జనవరి 10న చలో సైదాబాద్.
కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ పిలుపు.
సైదాబాద్ ప్రాంతంలో లోకాయుక్త కాలనీలో కూల్చివేసిన గుడిసెల స్థలంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా సైదాబాద్ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న గిరిజన ప్రజలను అక్కడి నుంచి తరిమివేయాలని దురుద్దేశపూర్వకమైన ఆలోచనతో స్థానిక ప్రజా ప్రతినిధుల, పోలీసుల, రెవెన్యూ అధికారుల సహకారంతో గుడిసెలను తొలగించడం అన్యాయమని అన్నారు.
బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి ఆనాడు ఆవాసయోగ్యానికి అనుకూలంగా లేని ప్రాంతం అయినటువంటి సైదాబాద్ లో ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. పట్టాల కోసం అనేక సందర్భాలలో పోరాటాలు నిర్వహించటం జరిగింది.
ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, నాయకులు జంగయ్య, అమీనా, దశరథ్ మరియు గుడిసె వాసులు దౌల్య ,ధర్మ ,బాల, నందు ,శంకర్, ప్రేమ సాలీబాయ్ ,హనుమంత్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.