Header Top logo

చిత్రపురి అవినీతి పై హై కోర్ట్ సంచలన తీర్పు

అలాట్మెంట్ లో లేని రిజిస్ట్రేషన్ లు రద్దు చేస్తూ ఆర్డర్…
సుమారు వెయ్యి రిజిస్ట్రేషన్ ల పైనే రద్దు అయ్యే అవకాశం..
అవినీతి కమిటీ కి సపోర్ట్ చేస్తున్న అధికారులు…
ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చిత్రపురి రక్షణ ఉద్యమకారులు కోరుతున్నారు…
చిత్రపురి బంగారుబాతు లాగా వాడుకున్న అవినీతి కమిటీ
అధికారుల పైన, అవినీతి కమిటీ పైన
హై కోర్ట్ జడ్జి కన్నేగంటి లలిత కుమారి గారి తీర్పు.
ఇప్పటికైనా పేద సినీ కార్మికుల కు న్యాయం జరుగుతుంది.. ఉద్యమకారులు..

తెలంగాణా ఉన్నత న్యాయస్థానం WRIT NO : 20552/22 ద్వారా 3 నెలలలో ట్రిబ్యునల్ స్టే వేకేట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినా కూడా డీసీవో గారు న్యాయస్థానం ఆర్డర్స్ ని దిక్కరించారు.

చిత్రపురిలో 2005-2020 సంవత్సరాలలో అన్నీ అంశాలలో భారీగా అక్రమాలు జరిగాయని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన యాక్ట్ – 51 నివేదిక మరియు సెక్షన్ – 60 రిపోర్ట్స్ ని అందజేశాయి.

ఈ అక్రమాలకు సంబందించి మొత్తం కమిటీని 16 మందిని రద్దు చేయాల్సి ఉండగా అందులో ప్రస్తుత కమిటీలో వున్న ఐదుగురు (5) గత 31-07-2021 నుండీ అంటే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుండీ చిత్రపురి గవర్నింగ్ బాడీలో కొనసాగుతూ మరిన్ని అక్రమాలకు బరితెగించారు.

దీనికి ప్రధాన కారణం రంగారెడ్డి జిల్లా డీసీవో శ్రీమతి ధాత్రీ దేవి గారు. డీసీవో గారు యాక్ట్ – 51 ఎంక్వయిరీని అపహాస్యం చేస్తూ… ట్రిబ్యునల్ లో స్టే తెచ్చుకొనేందుకు 21AA సెక్షన్ ని ఫ్రాడ్ కమిటీ సభ్యులు ఉపయోగించు కొనేందుకు పూర్తిగా సహకరించారు.

ఐదుగురిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారో ఎవరికీ తెలియనివ్వకుండా సీక్రెట్ గా జారీ చేసి డీసీవో గారు కూడా అక్రమాలలో భాగం అయ్యారు.

తదుపరి 21AA ప్రకారం వ్యక్తిగతంగా లబ్ది పొందలేదు అని ట్రిబ్యునల్ లో ఐదుగురు స్టే తెచ్చుకుంటే, మొత్తం 16 మంది వ్యక్తిగతంగా లబ్ది పొందారు అనేందుకు వందల సాక్ష్యాలు అందజేసినా ఆ స్టే ని వేకేట్ చేయకుండా వారిని కాపాడుతున్నారు

ఇప్పటికీ… మొత్తం చిత్రపురి అక్రమాలకు, ప్రస్తుతం జరుతున్న అక్రమాలకు పూర్తిగా డీసీవో గారు బాధ్యత వహించవలసి ఉంటుంది కావున… ఉన్నత అధికారులుగా మిమ్మల్ని కోరే అంశం ఏమిటంటే రంగారెడ్డి జిల్లా డీసీవో శ్రీమతి ధాత్రీ దేవి గారిని తక్షణమే డిస్మిస్ చేసి రంగారెడ్డి జిల్లాలోని సొసైటీలను రక్షించవలసినదిగా ఉద్యమకారులు, సినీ కార్మికులు కోరుతున్నారు

చిత్రపురిలో 2005-2020 మధ్యకాలంలో జరిగిన అక్రమాలకు గౌరవ తెలంగాణ ప్రభుత్వంచే నియమించబడిన యాక్ట్ – 51, సెక్షన్ – 60 సెర్చార్జ్ లు ధ్రువీకరించి అక్రమాలకు కారణం అయిన అప్పటి కమిటీ దాదాపుగా వంద కోట్లు చిత్రపురికి రికవరీ చేయాలని ఆదేశించాయి.

రంగారెడ్డి జిల్లా డీసీవో గారు గత ఒకటిన్నర సంవత్సరాల నుండి రిపోర్ట్ లో వచ్చిన అక్రమార్కులను కాపాడుతున్నారు., గత అక్రమాలలో భాగంగా ఉండి ఇప్పటికీ ప్రస్తుత కమిటీలో కొనసాగుతున్న ఐదుగురు (5) మరియు ప్రస్తుత కమిటీలో కొత్తగా ఎన్నికైన ఆరుగురు (6) మొత్తం 11 మంది 2020-2022 మధ్య కాలంలో చేసిన అవినీతి అక్రమాలను సాక్ష్యాలతో సహా మేము అందజేసినా కూడా వాటిని పట్టించుకొనే దిక్కులేదు.

గౌరవ తెలంగాణా ఉన్నత న్యాయస్థానాలు అనేక ఆర్డర్స్ ఇచ్చినా వాటిని సీరియస్ గా తీసుకోకుండా అక్రమార్కులకు సహకరిస్తూ కాలయాపన చేసారు, చేస్తున్నారు.

ఆఫీసియల్ ఫైవ్ మెన్ కమిటీ అలాట్ మెంట్ లేకుండా చిత్రపురిలో ఇల్లు రిజిస్ట్రేషన్ లు చేయకూడదు, కానీ అడ్డగోలుగా చేశారు అని చెప్పి, ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదు.

ప్రస్తుత కమిటీలోని కార్యదర్శి, కోశాధికారిలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తూ… మా కమిటీ ప్రభుత్వ జీవో లను, చిత్రపురి బై లాస్ లను మరియు 1964 కో ఆపరేటివ్ యాక్ట్ లలోని నియమ నిబంధనలు అన్నీ కాలరాసి ఆఫీసియల్ ఫైవ్ మెన్ కమిటీ అలాట్ మెంట్ లేకుండానే అక్రమంగా ఇల్లు కేటాయించి, కొత్త సభ్యత్వాలు ఇస్తూ, యాక్ట్ – 51 రిపోర్ట్ కి విరుద్ధంగా ప్రయివేటు వ్యక్తుల వద్ద దాదాపుగా 18 కోట్ల రూపాయలు 24% వడ్డీకి ( ప్రస్తుతం దాన్ని 18% తగ్గించారని తెలిసింది ) తీసుకొని తీవ్రమైన అక్రమాలకు పాల్పడింది కాబట్టి మా కమిటీని రద్దు చేయమని అన్నీ సాక్ష్యాలు సమర్పించారు.

అయినా రంగారెడ్డి జిల్లా డీసీవో గారు ఏమాత్రం చలనం లేకుండా ఎంక్వయిరీ కమిటీల పేరుతో కాలయాపన చేసి ఇంతవరకూ దానిపై స్పందించలేదు.

ఇన్ని రకాలుగా వైయలేషన్స్ చిత్రపురిలో జరుగుతున్నా, కోర్ట్ ఆర్డర్స్ ప్రాసెస్ లో వున్నా కూడా అక్రమంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ లు ఆగలేదు అంటే ఈ అవినీతి సామ్రాజ్యనికి రంగారెడ్డి జిల్లా డీసీవో గారు పూర్తిగా సహకరిస్తున్నారు అని నమ్ముతున్నాము కాబట్టి, ఇంక ఒక్కరోజు కూడా ఆవిడ డీసీవో గా కొనసాగేందుకు అర్హురాలు కాదు కాబట్టి తక్షణమే డీసీవో గార్ని డిస్మిస్ చేసి, మా చిత్రపురి ని రక్షించవలసినదిగా కోరుచున్నాము.

Leave A Reply

Your email address will not be published.

Breaking