జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మీడియా అకాడమీ ద్వారా చేపడుతున్నదని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తనను కలిసిన జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి సభ్యులకు తెలియజేశారు.
ఒకవైపు శిక్షణ మరోవైపు సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం తమ అకాడమీ ద్వారా నెరవేరుస్తున్నదని వారికి తెలిపారు.
జర్నలిస్టు సంక్షేమానికి శిక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను జార్ఖండ్ జర్నలిస్టులు ప్రశంసించారు 16 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ ప్రెస్ సలహాసమితి గురువారం తెలంగాణ మీడియా అకాడమీ ని సందర్శించింది.