Header Top logo

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు నోడల్ ఆఫీసర్లను నియమించిన -జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

ఏపి 39టీవీ 03 ఫిబ్రవరి 2021:

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులను నోడల్ ఆఫీసర్లను ఎన్నికల విధులను అప్పగిస్తూ, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.

కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం నోడల్ ఆఫీసర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1.జిల్లా ఎన్నికల ప్రణాళిక- గంగాధర గౌడ్, జేసీ(ఆసరా&సంక్షేమం)

2.బందోబస్తు- సత్య ఏసుబాబు, ఎస్పీ

3.ఎన్నికల సామగ్రి నిర్వహణ- టి.పద్మావతి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసి

4. రవాణా సంబంధిత వ్యవహారాలు- నిరంజన్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్

5.టెక్నికల్ సిబ్బంది నిర్వహణ- రవిశంకర్, అడిషనల్ డీఐఓ, ఎన్ఐసి

6. దరఖాస్తులు మరియు ఫిర్యాదుల నిర్వహణ – విశ్వేశ్వర నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

7. బ్యాలెట్ బాక్సుల సేకరణ- ప్రేమ చంద్ర, చీఫ్ ప్లానింగ్ ఆఫీసరు

8. మౌళిక సదుపాయాల కల్పన- శివ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈడబ్ల్యూఐడీసీ

9. వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ- వేణుగోపాల్ రెడ్డి, పీడీ డ్వామా

10. మైక్రో అబ్జర్వర్ల నిర్వహణ- సుదర్శన్ బాబు, జెనరల్ మేనేజర్, డీఐసీ

11. అబ్జర్వర్ల ప్రోటోకాల్- బీఎస్ సుబ్బారాయుడు, పీడీ, ఏపీ ఎమ్ఐపీ

12. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ- నిశాంత్ రెడ్డి, ఎఫ్ఎస్ఓ

13. సిబ్బంది నిర్వహణ(నాన్ టెక్నికల్)- సుబ్బారావు, డీడీ, ట్రెజరీ

14. మోడల్ కోడ్ – జె.రవీంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

15. విద్యుత్ సరఫరా – విజయ్ కుమార్, ఎస్ ఈ, ఏపీఎస్పీడీసీఎల్

16. అగ్ని ప్రమాద నివారణ-శరత్ బాబు, జిల్లా ఫైర్ ఆఫీసరు

17. మద్య నియంత్రణ – కుమరీశ్వరణ్, నోడల్ ప్రొహిబిషన్ మరియు ఎక్సయిజ్ సూపరింటెండెంట్

18. పంపిణీ సెంటర్ల ఏర్పాటు – ఎస్ఈ, పీఆర్

19. రిసెప్షన్ ఏర్పాట్లు- ఎస్ఈ, ఆర్ & బి

20. ఎన్నికల శిక్షణ – నరసింహా రెడ్డి, పీడీ, డీఆర్డీఏ

21. వైద్య సహాయం – జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి

22. ఎన్నికల వ్యయం నిర్వహణ – వెంకట్రాముడు, ఆడిట్ ఆఫీసరు & సుబ్బారావు, జిల్లా సహకార అధికారి

23. పర్యవేక్షణ బృందాలు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ – సబ్ కలెక్టర్/ ఆర్డివోలు

24. మీడియా నిర్వహణ – కె.జయమ్మ, సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ

నోడల్ ఆఫీసర్లందరినీ సమన్వయ పరిచి ఎన్నికలను సాఫీగా నిర్వహించే బాధ్యతను జాయింట్ కలెక్టర్లు (రెవెన్యూ మరియు రైతు భరోసా ), జాయింట్ కలెక్టర్ (గ్రా.వా.స & అ ) అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking