ఓ కేక్స్ బేకరీని ప్రారంభించిన
సినీ డైరక్టర్ శేఖర్ కమ్ముల
హైదరాబాద్, ఏప్రిల్ 3: ప్రముఖ బేకరి సంస్థ అయిన ఓ కేక్స్ బేకరి ను హైదరాబాద్ నగరం ఎస్అర్ నగర్ లో ప్రముఖ సినీ డైరక్టర్ శేఖర్ కమ్ముల ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కువ మంది వెజ్ టేరియన్ సంబంధిత అహరాన్ని ఇష్టపడుతున్నారన్నారు శేఖర్ కమ్ముల.
వెజ్ సంబంధిత కేక్స్ నే విక్రయించడం మంచిదన్నారు. నాణ్యమైన బేకరి ఉత్పత్తు లను అందిస్తున్న ఓ బేకరి కి అభినందనలు తెలిపారు ఆయన. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి నాణ్యమైన శుబ్రతతో కూడిన కేకులని అందించాలని ఆయన కోరారు.
కేకులు, కప్ కేకులు, చాక్లెట్ కేకులు, పాస్ట్రిస్, కుకీస్, బ్రెడ్స్, సవోరి వంటివి అందుబాటులో ఉన్నాయని ఓ కేక్స్ అధినేత బడేటి వెంకటరత్నం , ఓ కేక్స్ డైరక్టర్ అనురాగ్ బడెటి తెలిపారు.