Header Top logo

క్రైం డిటెక్టివ్ నవల రచయిత మధుబాబు ప్రస్థానం

అపరాధ పరిశోథక నవలల రచయిత డిటెక్టివ్
“మధుబాబు” పుట్టిన రోజు….!!

ఇప్పటి తరం ఏమో కానీ,మా తరంలో డిటెక్టివ్నవలుచదవని వారు లేనేలేరు. ముఖ్యంగా మధుబాబు డిటెక్టివ్ నవలలకు ఫిదా అయి పోయేవాళ్ళం.ఎన్నెన్ని నవలలో? ఒక్కో నవల ఒక్కో ఆణి ముత్యం. డిటెక్టివ్ నవలలు చదవడం అంటే పెద్దల దృష్టిలో మైనస్.అందుకే,చాటుమాటుగానే డిటెక్టివ్ నవలు చదివే వాళ్ళం.చిన్నప్పుడు ఈ రచయిత గురించి.. మాకు పెద్దగా తెలిసేది కాదు.

కానీ, అతనో అచ్చు యంత్ర మని మాత్రం అనుకునే వాళ్ళం.ఓ సారి నవల తెరిస్తే పూర్తయ్యే దాకా ఒకటే టెన్షన్‌! ఏమవుతుంది ? ముందే మవుతుంది?డిటెక్టివ్ ఎలా ఆరాతీస్తాడు.అసలు నేరస్తుడ్ని పట్టుకుంటాడా? పట్టుకుంటే ఎలా పట్టుకుంటాడు? టెన్షన్…ఒకటే… టెన్షన్.నవల పూర్థయ్యే దాకా ఇదే టెన్షన్.!

ఒక నవలకే మనకింత టెన్షన్ అయితే.!.మరి ఇన్ని నవలు రాస్తున్న మధుబాబుకు ఎంత టెన్షన్ వుండాలి? అప్పట్లో మాకు తెలీదు కానీ,ఇప్పుడర్థమవుతోంది. అయితే మధుబాబు గారిని చూస్తే మాత్రం టెన్షన్ పడ్డోడి మాదిరిగా అనిపించడు.కనిపించడు. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే‌చూడండి. ‘ఇంత వయసులో కూడా అంత హుషారుగావున్నాడే? అని…’…అనిపించక మానదు.

ఎవరీ మధుబాబు…?

మధుబాబు అసలు పేరు… వల్లూరు మధుసూదన రావు.”
ప్రముఖ తెలుగు నవలా రచయిత అని వేరే చెప్పక్కర్లేదు.

మధుబాబు జులై 6, 1948 న కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబం లో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ రావు, తల్లి భారతి. తండ్రి గ్రామ కరణంగా పనిచేసేవారు. మధుబాబుకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఏడో తరగతి వరకు తోట్లవల్లూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. చదువు సరిగా సాగకపోవడంతో తండ్రి ఈయనను ఎ. కొండూరు మండలంకంభం పాడు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబాయి దగ్గరకు పంపించారు.

మధుబాబు అక్కడచదువుతున్నప్పుడే నాటకాలమీద, సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. SSLC కోసం మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చారు.తండ్రి స్వతహాగా సాహిత్యాభిమాని. ఆయన ఎక్కువగా శరత్ సాహిత్యంచదివేవాడు. వీరి ఇంట్లో సుమారు 2000 కు పైగా పుస్తకాలుండేవట. వీటిలో చాలా పుస్తకాలు చదివాడు‌ మధుబాబు.

మచిలీపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు.హైదరాబాదులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభలో అకౌంటెంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కళాశాలలో చదువు తూ పి. యు. సి, తర్వాత బి. కాం పూర్తి చేశాడు.తను పని చేసే చోటనే ఉన్న గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివాడు. కొద్దికాలం హైదరబాదు రిజర్వు బ్యాంకులోకాయిన్,
నోట్ ఎక్జామినర్ కూడా పనిచేశాడు. అదే సమయంలో నాటకాల మీద ఆసక్తితో చాలా నాటకాల్లో పాల్గొన్నాడు. ఆతర్వాత కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.

రచనా వ్యాసంగం..!!

ఎక్కువగా పరిశోథనాత్మక (డిటెక్టివ్) నవలలు రాశారు.
ఈయన నవలల్లో “షాడో ” కథానాయకుడిగాకనిపిస్తాడు.
కొన్ని నవలలలో ‘ వాత్సవ్‌ ‘ని కూడా కథానాయకుడ్ని చేశారు.

జీవితంలో ఏదో సాధించాలనే తపనతో అనేక ప్రాంతాల్లో పర్యటించారు.. 1972 నాటికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడే రచనలు మొదలు పెట్టాడు. తన మొదటి రచన ప్రారంభించక మునుపే ఎం. వి. ఎస్. పబ్లిషర్స్ అనే సంస్థ కు వెళ్ళి తన దగ్గర ఒక నవల ఉన్నదనీ ప్రచురిస్తారా అని అడిగాడు. విషయం బాగుంటే ప్రచురిస్తామన్నారు వాళ్ళు. దాని తర్వాత ఆయన కేవలం మూడు రోజుల్లోవాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ అనే నవలను రాసి వారికి ఇచ్చాడు. ఇది 15 సార్లు పునర్ముద్రితమైంది. ఆయన అందుకున్న తొలి పారితోషికం 50 రూపాయలు. ఈయన రచయిత కావడం వెనుక స్నేహితుడు బొర్రా సుబ్బారావు ప్రోత్సాహం ఉంది. ఈయన మధుబాబును మరిన్ని రచనలు చేసేలా ప్రోత్సహించాడు.

తొలి రచనలు ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆ తరువాత మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో ఈయనే సొంత ప్రచురణసంస్థను ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో మధుబాబు నవలలు ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి.

నవలల్లో తనెక్కడా కనిపించడు. వినిపించడు. మాట్లాడడు నవలల్లోని పాత్రలు  మాత్రమేకనిపిస్తాయి. మాట్లాడతాయి. మధుబాబు అనగానే కేవలం డిటెక్టివ్ నవలలే గుర్తుకు …రావడం సహజం.కానీ ఈయన జానపద నవలలు కూడా రాశాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. డిటెక్టివ్ నవలల మాది రిగానే…ఇవికూడా జనాదరణ పొందాయి.ఆయన రాసిన నవలలు వందకు పైమాటే.

షాడో…ఢిషుం..ఢిషుం..!!

డిటెక్టివ్ షాడో నాయకుడిగా అనేక నవలలు రాశాడు. రచయిత మధుబాబును గుర్తుంచుకుంటారో లేదో…  తెలీదుకానీ… షాడో మాత్రం ఖచ్చితంగా గుర్తుండి పోతాడు. ఎ బుల్లెట్ ఫర్ షాడో, ప్రొఫెసర్ షాడో, రెడ్ షాడో, రివెంజ్ రివెంజ్రన్ షాడో రన్,షాడో ఇన్ బాగ్దాద్ షాడో , షాడో ఇన్ హైదరాబాద్ , షాడో ఇన్ ది జంగిల్, షాడో  ఇన్ కోచ్చిన్,షాడో ఇన్ జపాన్, షాడో ఇన్ సిక్కిం, షాడో ఇన్ థాయ్‌లాండ్, షాడో ది అవెంజర్, షాడో !, షాడో ! షాడో , !! , షాడో ది స్పై కింగ్ షాడో వొస్తున్నాడు జాగ్రత్త., కిల్ థెం మిస్టర్ షాడో, సైంటిస్ట్ షాడో,రన్ షాడో రన్, ఒన్స్ ఎగైన్ షాడో,ప్రొఫెసర్ షాడో, రెడ్ షాడో,సైంటిస్ట్ షాడో…

ఇలా షాడో అడ్వెంచర్స్ ను చూపించే ఉత్కంఠ నవలలకు మధుబాబు పెట్టింది పేరు..ఇన్ బార్నియోఎ డెవిల్ ఎ స్పై (మూడు భాగాలు) ఏంజెల్ అఫ్ డెత్ (రెండు భాగాలు)ఆన్ షాడో (రెండు భాగాలు)అస్సైన్‌మెంట్ లవ్బర్డ్ , అస్సైన్‌ మెంట్ కరాచి (రెండు భాగాలు),ఎ జర్నీ టు హెల్,‌ ఎమినిట్ ఇన్ హెల్బాబా, బద్మాష్, బంజాయ్ భోలా శంకర్ (రెండుభాగాలు),బ్లడీ బోర్డర్ బ్లడ్ హౌండ్, బాంబింగ్ స్క్వాడ్ది బ్రెయిన్ వాషర్స్, బ్రోకెన్ రివోల్వర్ , బఫ్ఫెలో హంటర్స్,బర్మా డాల్ కార్నివాల్ ఫర్ కిల్లర్స్ కళ్యాణ తిలకం, కంకాళ లోయ, కేండో వారియర్, కిల్ క్విక్ ఆర్ డై,కిల్లర్స్గ్యాంగ్, కిస్ కిస్ కిల్ కిల్, లైసెన్స్ టు కిల్, మధు మాలిని, మేరా నామ్ రజూలా,

మిడ్ నైట్ అడ్వంచర్ (రెండు భాగాలు),మిడ్ నైట్ ప్లస్ వన్ (రెండు భాగాలు),మిషిన్ టు పెకింగ్,మర్డరింగ్ డెవిల్స్, నెవర్ లవ్ ఎ స్పై,నైట్ వాకర్, నెంబర్ 28,ఒన్స్ అగైన్ షాడో, ఆపరేషన్ ఆరిజోనా,ఆపరేషన్ బెంగాల్ టైగర్, ఆపరేషన్ కౌంటర్ స్పై,ఆపరేషన్ డబుల్ క్రాస్,ఆపరేషన్ కాబుల్,ప్లీజ్ హెల్ప్ మీ,రన్ ఫర్ ది బోర్డర్,రన్ ఫర్ ది హైల్యాన్డ్స్,సైంటిస్ట్ మిస్ మాధురి,సీక్రెట్ ఏజెంట్ ,మిస్టర్ షాడోసెవెంత్ కిల్లర్,సిల్వర్ కింగ్,స్పైడర్ వెబ్,టేస్ట్ ఫర్ డెత్, టెంపుల్ అఫ్ డెత్టెన్ అగైనెస్ట్ షాడో (రెండు భాగాలు) టెర్రా 205 (రెండు భాగాలు)టెర్రర్ ఐలాండ్,ది కర్స్ అఫ్ కుంగ్ ఫు,ది గర్ల్ ఫ్రం సి.ఐ.బి., ది కిల్లర్ ఫ్రం సి.ఐ.బి., టైగర్ మున్నా,టైం ఫర్ లవ్,టు షాడో విత్ లవ్ ట్రబుల్ మేకర్స్,2 మైల్స్ టు ది బోర్డర్,విప్లవం వర్ధిల్లాలి,వాంటెడ్  డెడ్ ఆర్ ఎలైవ్,కాలకన్య,కాలనాగు,

కాళికాలయం (మూడు భాగాలు)కళ్యాణ తిలకం,కంకాళ లోయ, కేండో వారియర్,కిల్ క్విక్ ఆర్ డై,కిల్ థెం మిస్టర్ షాడో,కిల్లర్స్ గ్యాంగ్ ,కిస్ కిస్ కిల్ కిల్లైసెన్స్ టు కిల్ ,మధు మాలిని మేరా నామ్ రజూలా,మిడ్ నైట్ అడ్వంచర్ (రెండు భాగాలు)మిడ్ నైట్ ప్లస్ వన్ (రెండు భాగాలు)మిషిన్ టు పెకింగ్ ,మర్డరింగ్ డెవిల్స్ నెవర్ లవ్ ఎ స్పై,నైట్ వాకర్ నెంబర్ 28 రన్ షాడో రన్, ఆపరేషన్ ఆరిజోనా, ఆపరేషన్ బెంగాల్ టైగర్ ,ఆపరేషన్ కౌంటర్ స్పై ఆపరేషన్ డబుల్ క్రాస్,ఆపరేషన్ కాబుల్ ,ప్లీజ్ హెల్ప్ మీ రివెంజ్ రివెంజ్.రన్ ఫర్ ది బోర్డర్.రన్ ఫర్ ది హైల్యాన్డ్స్. సైంటిస్ట్ మిస్ మాధురి.సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో.సెవెంత్ కిల్లర్.

విప్లవం వర్ధిల్లాలి,వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్ , హు ఆర్ యు యముడు,ఆనంద జ్యోతి, ఆర్తి, అతను, భవాని, బొమ్మ క్రైం కార్నర్,చక్ర తీర్థం, డెత్ వారంట్ ,ఫైనల్ వార్నింగ్ ఘర్షణ ,హెచ్చరిక,శిక్ష (రెండు భాగాలు) స్పందన, శంకర్  దాదా (రెండు భాగాలు)శ్రావని, స్వర్ణ ఖడ్గం (రెండు భాగా
లు)జ్వాలాముఖి, కంకన రహస్యం,నందిని,పాము,పులి మడుగు,రహస్యం,రుద్రాణి,రెడ్ అలెర్ట్,రెడ్ సిల్వర్ రుద్ర భూమి,సాలభంజిక,సాధన,వర్జిన్ ఐస్లాండ్, విశ్వ ప్రయత్నం,టైగర్ వాత్సవ,టైం బాంబు,టాప్ సిక్రేట్ టాప్ టెన్,టచ్ మీ నాట్ వెన్నెల మడుగు

టీవీ ధారావాహికలు!!

చక్ర తీర్థం (ఈ టీవీ)
కాళికాలయం ( జెమిని టీవీ)
శంకర్ దాదా, శిక్ష..మొదలైనవి.!!

వెబ్ సీరీస్…!!

మధుబాబు నవలలు ఇప్పుడు వెబ్ సీరీస్ గా కూడా రాబోతున్నాయి. ఏకే ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర వీటిని వెబ్ సిరీస్​గా తెరకెక్కించేందుకు ప్రయత్నం  మొదలుపెట్టారు. ‘మధుబాబు షాడో ’ పేరుతో త్వరలోనే టివీ తెరపై మనం చూడొచ్చు..!!

ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking