Header Top logo

డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో స్యా నిటైజర్ మరియు మస్కుల పంపిణీ

AP 39TV 07 మే 2021:

అనంతపురం జిల్లా మడకశిర: స్థానిక మడకశిర పట్టణంలో సర్కాల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సర్కల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కి,ఎస్ఐ శేషగిరి కి మరియు వారి సిబ్బందికి దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్యానిటైజర్లు మరియు మస్కుల పంపిణీ చేపట్టడం జరిగింది.తదనంతరం సీఐ మరియు ఎస్సై కి సన్మానం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా డి హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి రెండురోజుల క్రితం కరోనా మహమ్మారిని నివారించుటకు తీసుకున్న నిర్ణయం పాక్షిక లాక్ డౌన్ ను విజయ వంతం చేయుటకు స్థానిక పోలీస్ అధికారులు 42 డిగ్రీల వేడిని తట్టుకొని చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు, స్థానిక సి ఐ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని,తప్పక మాస్కులు దరించాలన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపు మీ.మీ పనులను ముగించుకొని ఇండ్లలోనే ఉండాలన్నారు. ఎస్సై శేషగిరి  మాట్లాడుతూ పట్టణ ప్రజలు సకాలంలో స్పందించి కోవిడ్ సెకండ్ వెవ్ ను ఎదుర్కొనుటకు తగు జాగ్రత్తలు తీసుకొని కొవిడ్ వైరస్ ను దరిచేరనివ్వకుండ చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో రీడ్స్ నాయకురాలు టి ఎన్ భాగ్యలక్ష్మి, యువానాయకుడు ఎచ్ సత్య తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking