Header Top logo

వ్యక్తిగత కారణాలతో ఇద్దర్ని వేర్వేరుగా చంపాలనుకున్న కుట్ర భగ్నం

AP 39TV 07 మే 2021:

ధర్మవరం పట్టణంలో వ్యక్తిగత కారణాలతో ఇద్దర్ని వేర్వేరుగా చంపాలనుకున్న కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హతమార్చేందుకు సిద్ధం చేసుకున్న ఫిస్టోల్ పట్టుకున్నారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఆర్టీసి కండక్టర్ , మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. వీరి నుండి
ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిస్టోల్ కొనుగోలుకు సహకరించిన ఓ CISF కానిస్టేబుల్ ను అరెస్టు చేయాల్సి ఉంది. శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:1) కప్పల గంగాధర్ , వయస్సు 37 సం., ధర్మవరం పట్టణం.2) కరంతోట్ మురళీ నాయక్ , వయస్సు 34 సం., ధర్మవరం పట్టణం.

స్వాధీనం చేసుకున్నవి:ఫిస్టోల్ , ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు.వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడిన పిస్టోల్ కేసు నమోదు, దర్యాప్తు ముమ్మరం.

ధర్మవరం పోలీసు స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల రైల్వే బ్రిడ్జి వద్ద రెండు వారాల కిందట డీఎస్పీ రమాకాంత్ ఆదేశాలతో పట్టణ సి.ఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఓ వ్యక్తి వద్ద పిస్టోల్ పట్టుబడింది. అతను ద్విచక్ర వాహనంలో పరారయ్యాడు. దీనిపై అర్బన్ పోలీసు స్టేషన్లో కేసు( క్రైం నంబర్ : 169/2021 U/S (1B) Indian Arms Act) నమోదయ్యింది. కేసు ఛేదింపునకు 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినాయి .పిస్టోల్ పట్టివేత కేసు వెంటనే ఛేదించాలని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  ఆదేశించారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. పక్కా సమాచారంతో  ధర్మవరం అర్బన్ సి.ఐ కరుణాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందంగా వెళ్లి నిన్న సాయంత్రం ధర్మవరంలో కప్పల గంగాధర్ , కరంతోట్ మురళీ నాయక్ లను అరెస్టు చేశారు.ప్రస్తుతం అరెస్టయిన వీరిలో మొదటి నిందితుడైన కప్పల గంగాధర్ కు ధర్మవరంకు చెందిన ఓ వ్యక్తికి స్థల వివాదం, రియల్ ఎస్టేట్ లావాదేవీలలో గొడవలు ఉన్నాయి. అతని అడ్డు తొలగించుకునేందుకు అతనిని చంపాలని భావించాడు. ఇదిలా వుండగా… రెండవ నిందితుడైన కరంతోట్ మురళీనాయక్ ధర్మవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఇతని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్యకు కారణమైన ఓ వ్యక్తిని చంపాలని కరంతోట్ మురళీనాయక్ భావించాడు. ఇతను, కప్పల గంగాధర్ చర్చించుకుని శత్రువులను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేశారు. వీరికి పరిచయమున్న ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లికి చెందిన బాలునాయక్ ను సంప్రదించారు. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లాలో CISF కానిస్టేబుల్ గా పని చేస్తున్న బాలునాయక్ సహకారంతో బెంగుళూరులో రూ. 2.50 లక్షలు పెట్టీ పిస్టోల్ కొనుగోలు చేశారు. ఈ పిస్టోల్ ను కప్పల గంగాధర్ వెంట తీసుకెళ్తూ రెండు వారాల కిందట పోలీసుల వాహనాల తనిఖీలో పట్టుబడింది. పిస్టోల్ కొనుగోలుకు సహకరించిన CISF కానిస్టేబుల్ బాలునాయక్ ను అరెస్టు చేయాల్సి ఉంది. కప్పల గంగాధర్ నుండి ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనం కూడా క్రైం నంబర్ 168/2021 U/S 379 IPC కేసులో దొంగతనానికి గురయ్యిందే. ఇద్దరి హత్య కుట్ర భగ్నం చేసి ఇద్దరి అరెస్టు, పిస్టోల్ స్వాధీనం చేసుకున్న ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో సి.ఐ కరుణాకర్ , సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  ప్రశంసించారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking