AP 39TV 04మే 2021:
నగరంలో త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని మేయర్ మహమ్మద్ వసీం సూచించారు.నగరంలోని 31 వ డివిజన్ లో జరుగుతున్న తారురోడ్డు పనులను మంగళవారం మేయర్ మహమ్మద్ వసీం నగర కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి తో కలసి పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభంలోపు రోడ్ పనులన్నీ పూరి అయ్యేలా వేగవంతం చేయాలని ఆ దిశగా ఇంజనీరింగ్ అధికారులు చూడాలని ఆదేశించారు.అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో నగరంలో 140 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణపు పనులు జరుగుతున్నాయని పనులన్నీ పూర్తి అయితే నగరానికి నుతన శోభ చేకూరుతుందన్నారు.నగరంలోని అన్ని రోడ్లను దశల వారిగా అభిరుద్ది చేస్తామన్నారు.కార్పొరేటర్ లు కమల్ భూషణ్, బాబా ఫక్రుద్దీన్ , నాయకులు ఖాజా,సూరి,రియాజ్ లతో పాటు కాంట్రాక్టర్ రఘునాథరెడ్డి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.