ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:
రాయదుర్గం తాలూకా, కనేకల్ మండలం, కనేకల్ పట్టణంలో పలు గ్రామాల లో స్థానిక ఎన్నికలకు నామినేషన్ వేసిన అభ్యర్థులు తన నామినేషన్ పత్రాలు అధికారుల పరిశీలన చేశారు. ఆ నామినేషన్ పత్రాల లో ఏవైనా పొరపాట్లు ఉన్నచో అభ్యర్థి ఈరోజు అనగా 05-02-2021 తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల వరకు అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని స్థానిక ఎలక్షన్లలో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, వార్డు అభ్యర్థి కావచ్చు తమ నామినేషన్ పత్రాలను పరిశీలన చేసిన వెంటనే తమ పత్రాలలో ఏవైనా పొరపాట్లు ఉన్నచో అధికారులు కు తెలియజేసి తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం ప్రజలకు అభ్యర్థి నామినేషన్ వేసిన ఆఫీసులోని అవకాశం ఉంటుంది దీన్ని నామినేషన్ అభ్యర్థులు సద్వినియోగ పరచుకొని అధికారులు తెలియజేశారు. ప్రజలు కూడా తమ నామినేషన్ పత్రాల పరిశీలనకు అధికారుల సూచనల మేరకు ఒక క్రమపద్ధతిలో నామినేషన్ల పరిశీలన చేయించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా ప్రజలకు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశీలన చేయడం జరిగింది.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,