ఏపి 39టీవీ 09 ఫిబ్రవరి 2021:
బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం గ్రామపంచాయతీ లో వైఎస్సార్సీపీ తరఫున శ్రీమతి బి పి ప్రేమ సర్పంచి పదవికి పోటీ చేసినందువల్ల ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యే శ్రీమతి ఉష శ్రీ చరణ్ విచ్చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే సర్పంచ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మేడం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ డైరెక్టర్ బిపి ప్రసాద్ రెడ్డి , మాజీ ఎంపీపీ బిపి తిరుపాల్ రెడ్డి, తిప్పేస్వామి ,బసవరాజు, పాతయ్య, మల్లికార్జున స్వామి, తిమ్మారెడ్డి, చిన్న రాజయ్య, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే టిడిపి నుంచి 10 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీ లోకి రావడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు యువకులు వైయస్ఆర్ సీపీ నాయకులు పాల్గొనడం జరిగింది.