Header Top logo

బీసీ జర్నలిస్టుల సెమినార్ సక్సెస్.. కానీ..?

బీసీ జర్నలిస్టుల సెమినార్ సక్సెస్..

అయినా.. సందేహాలు ఎన్నో..?

ఔను.. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో బీసీ సమాజ్ పేరిట జరిగిన బీసీ జర్నలిస్టుల సమ్మళనం సక్సెస్ అయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలువురు బీసీ జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా మెజార్టీగా ఉన్న బీసీ జర్నలిస్టులు ఐక్యతగా ఉంటే భవిష్యత్ లో బీసీల రాజ్యాధికారం వచ్చి తీరుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు పలువురు సీనియర్ జర్నలిస్టులు.

     కులాలు, మతాలకు అతీతంగా జర్నలిజంలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా కులం పేరుతో.. మతం పేరుతో జరుగుతున్న వివక్షను చూసి బీసీ జర్నలిస్టుల ఐక్యత అత్యావసరమని భావించారు. సీనియర్ జర్నలిస్ట్ విద్య వెంకట్ యాంకరింగ్ అందరిని ఆకట్టుకుంది. ఉపన్యాసం ఇచ్చిన తరువాత యాంకర్ తనదైన శైలిలో చెప్పుతూ సభను నిర్వహించారు. ముప్పయి ఏళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ సూర్యరావు బీసీల ఐక్యత కోసం చేస్తున్న కృషిని అభినందించారు.

బీసీల రాజ్యాధికారం కోసం బీసీ జర్నలిస్టులు ఉద్యమించాలని పిలుపును ఇచ్చారు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఎస్. వెంకటనారాయణ. సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలు ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసి ముందుకు సాగితే బీసీల రాజ్యాధికారం తద్యమని ఆయన పేర్కొన్నారు.

అధికార పార్టీ టార్గెట్ గా పొలిటికల్ స్పీచ్ లు..

రాజకీయాలకు అతీతంగా ఈ బీసీ జర్నలిస్టుల సెమినార్ నిర్వహిస్తున్నామని నిర్వహకులు మొదటి నుంచి చెప్పారు. కానీ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక పోవడంతో సభలో మాట్లాడిన వ్యక్తలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కూడా ఈ సెమినార్ లో పాల్గొనలేరు. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేంధర్ అధికార బీఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేసి తనదైన శైలిలో మాట్లాడారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలతో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లలో పనికి రాని హెల్త్ కార్డులను ప్రస్థావించిన ఈటెల భవిష్యత్ లో తమ ప్రభుత్వం వస్తే జర్నలిస్టుల సమస్యలను పరిష్కారిస్తానని హామి ఇచ్చారు. డిగ్రీలు, పీజీలు చేసిన జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులను ఈటెల గుర్తు చేశారు. మరో అతిథి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరవత్రి అనిల్ కూడా బీసీ జర్నలిస్టులు ఐక్యం కావడం శుభ సూచకం అంటూనే బీజేపీ, బీఆర్ ఎస్ లు బీసీలకు చేస్తున్న మోసాలను పేర్కొన్నారు.

జర్నలిస్టుల స్పీచ్ లలో అర్థాలు ఎన్నో..

బీసీ జర్నలిస్టుల సమ్మెళనంలో సీనియర్ జర్నలిస్టుల స్పీచ్ అందరిని ఆలోచింప చేసే విధంగా ఉంది. వార్డు మెంబర్ కానోడు పొలిటికల్ లీడర్ నేడు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిసి విలాస వంతమైన జీవితాలు అనుభవిస్తుంటే బీసీ జర్నలిస్టుల బతుకు మాత్రం మారలేదని గుర్తు చేశారు సీనియర్ జర్నలిస్టులు. పొలిటికల్ లీడర్ లకు స్పీచ్ రాసిచ్చి అగ్రవర్ణాలను లీడర్ లను చేస్తున్నామనే విషయాన్ని గుర్తు చేశారు పలువురు. అయితే.. బీసీలు పొలిటికల్ లీడర్ లుగా ఎదిగితే రాజ్యాధికారం వస్తుందన్నారు. ఆఫెక్స్ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు సంఘెం సూర్యరావు,  నాగ పరిమళ, తెలంగాణ విఠల్,  పెద్దబుద్దుల సతీష్ సాగర్, సతీష్ కమల్,  విద్యా వెంకట్, మన తొలి వెలుగు రఘు, కస్తూరి శ్రీనివాస్, కోట్ల చంద్రకాంత్,  నారు,  ఉప్పు సత్యానారాయణ, మ్యాదం మధుసూదన్,  రాజామౌళి, చైతన్య,  సప్తగిరి గోపగాని, ఉప్పరి శేఖర్ సాగర్ చింతల నీలకంఠం,  గొల్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

కష్టాలలో ఉన్నోళ్లకు భరోసాగా టోల్ ఫ్రీ నెంబర్

బీసీ జర్నలిస్టుల జీవితాలకు భరోసాగా మనం ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ చేసిన సూచనను పలువురు స్వాగతించారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా మనవారు కష్టాలలో ఉన్నట్లు మెస్సెజ్ పెట్టిన వెంటనే సహాయం చేయడానికి స్పందించే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలనే సూచన చేశారు ఓ సీనియర్ జర్నలిస్ట్. ఒక్కో జర్నలిస్ట్ వెయ్యి మందితో సమానం.. మనం అనుకుంటే మన బీసీలను రాజకీయంగా చైతన్య వంతులను చేస్తే భవిష్యత్ మనదే అంటూ ఉదాహరణలతో పేర్కొన్నారు మహిళా జర్నలిస్ట్. బీసీ కులాలను గుర్తు చేస్తునే ఎమ్మెల్యేలుగా ఎక్కడెక్కడా గెలువచ్చో నియోజక వర్గాల పేర్లను లెక్కలతో వివరించారు.

బీసీ జర్నలిస్టుల సభపై పలు అనుమానాలు

అయితే.. వేదికపై కూర్చున్న వారిలో..  స్పీచ్ ఇచ్చిన వారిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే వారే ఉండటంతో ఈ బీసీ జర్నలిస్టుల సభపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అన్యాయాలను నిలదీసేవాడే అసలైన జర్నలిస్ట్.. కానీ.. యూట్యూబ్, ఈ-పేపర్ ల యజమానులు ఈ వేదికను పంచుకోవడం చర్చా నీయంశంగా మారింది. ఎఫెక్స్ కమిటీ అండ్ సీనియర్ జర్నలిస్టులతో పాటు ఇతరులు కూడా స్పీచ్ లు ఇచ్చారు. అయినా.. బీసీ జర్నలిస్టులు తొలి అడుగులు వేయడం మంచిందంటున్నారు కొందరు జర్నలిస్టులు.

తీర్మాణాలు చేయకుండానే వెళ్లి పోవడం..?

బీసీ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో రావడంతో సెమినార్ సక్సెస్ అయినట్లే.. కానీ.. చివరలో ఫోటోలు దిగి వెళ్లి పోవడంతో విమర్శలు వచ్చాయి. బీసీ జర్నలిస్టుల భవిష్యత్ ప్రణాళిక గురించి తీర్మాణాలు చేయకుండానే వెళ్లి పోవడం నిర్వహణ లోపంగా కనిపించింది. సభ వేదికపై సభాధ్యక్షులు సూర్యరావు బీసీ సమాజ్ జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్,  కో- కన్వీనర్ లను ప్రకటించిన సందర్భంలో పాత జిల్లాల నుంచి పదిమందిని కూడా కో-కన్వీనర్ లుగా ప్రకటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు. అలాగే భవిష్యత్ ప్రణాళికతో తీర్మాణాలు చేసి ఆమోదించి ఉంటే బీసీ సమాజ్ సెమినర్ ఉద్యేశ్యం నెరవేరేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు సీనియర్ జర్నలిస్టులు.

యాటకర్ల మల్లేష్,  జర్నలిస్ట్

సెల్ : 949 222 5111

Leave A Reply

Your email address will not be published.

Breaking