Header Top logo

Baburao Nilopher Cafe Tea *హైదరాబాద్ అంటే…’నీలోఫర్ కేఫ్’ ! చాయ్  కూడా….!!

*హైదరాబాద్ అంటే…’నీలోఫర్ కేఫ్’ ! (Cafe Nilopher  Tea )

చాయ్  కూడా….!!

nilofar cafe

హైదరాబాద్,లక్డీకాపూల్ సమీపంలోని రెడ్ హిల్స్‌ “నీలో ఫర్ కేఫ్ ” లో చాయ్ తాగటం ఓ ప్రివిలేజ్.అసలు చాయ్ కు….హైదరాబాదుకు ఓ అవినాభావ సంబంధం వుంది. ఓ కప్పు చాయ్ తాగాలన్న కోరిక ప్రతీ… హైదరాబాదీకి వుంటుంది.అలాగే…నీలోఫర్ కేఫ్ చాయ్ రుచి ప్రతీ….. హైదరాబాదీ హృదయానికి తెలుసు.(ఏక్ ప్యాలా చాయ్ కి తమన్నా…సార్ హైదరాబాదీ కి రగ్  రగ్ మే హై…ఔర్. నీలో ఫైర్ కి చాయ్ కా స్వాద్… హర్ హైదరాబాదీకే దిలోమే హై..!!) ఒక్క మాటలో చెప్పాలంటే…నీలో ఫర్ కి షాందార్ కీ  చాయ్… హైదరాబాద్ కి షాన్.(Niloufer Ki Shaandar Chai,…Hyderabad Ki Shaan!)

హైదరాబాద్ లోని నీలో ఫర్ పిల్లలు ఆస్పత్రి పక్కనే వున్న’కేఫ్ నీలో ఫర్ ‘  కు ఓ సుదీర్ఘ చరిత్ర వుంది.1978 లో కేఫ్ నీలో ఫర్ ప్రారంభమైంది.(Café Niloufer was started in 1978 ) ఈ కేఫ్ ను ఎవరు ప్రారంభించారన్నది పక్కనే బెడితే… ఇంత గొప్ప కేఫ్ గా తీర్చిదిద్దింది మాత్రం.. బాబూరావు. నాలుగు దశాబ్దాలుగా కేఫ్ నీలో ఫర్ చాయ్ ను హైదరాబాదీలు ఆస్వాదిస్తున్నారంటే…. చిన్న విషయం కాదు. చివరకు’ కేఫ్ నీలో ఫర్ చాయ్’ హైదరాబాదు సంస్కృతిలో ఓ భాగమై పోయింది.కేవలం చాయ్ మాత్రమే కాదు.. తాజాగా వుండే ఉస్మానియా బిస్కెట్స్, మలాయి బన్, సరసమైన ధరలకు కేరాఫ్….”  కేఫ్ నీలోఫర్ “.!!  latest world-class baking technology, తో అత్యంత పరిశుభ్రంగా ఇక్కడ బిస్కెట్స్,బన్ రొట్టెలు, 🍪 కుకీస్తయారు చేస్తారు..

Baburao Nilopher Cafe Tea

అదికూడా ప్యూర్ వెజిటేరియన్..!! కేఫ్ నీలో ఫర్  ‘ కడక్’ చాయ్  (kadak chai ) బాబూరావు ఇన్ వెన్షనే ( Invention) ఎప్పుడు చూసినా…రద్దీగా వుండే ఈ కేఫ్ లో రోజుకు కనీసం 5 వేల మందికి… తక్కువ‌కాకుండా..”చాయ్” తాగుతుంటారు. తెల్లవారు జామున నాలుగు న్నారు గంటలకు మొదలయ్యే చాయ్ సేవనం ….అర్ధరాత్రి వరకు  నిరంతరంగా.. (  Without Break) కొనసాగుతూనే వుంటుంది.అలాగే ఉదయాన్నే అల్పాహారంగా..’  మలాయ్…రోటీ , చాయ్.’ తీసుకోవడం ఒక అలవాటైపోయింది.ఈ కేఫ్ కు అనుబంధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన బేకరీ కూడా వుంది.

*కృషి వుంటే..మనుషులు

‘బాబురావు’ అవుతారు…!!

 

‘కృషి వుంటే మనుషులు రుషులవుతారని’ అంటారు కానీ,ఇక్కడ కృషితో బాబూరావు ఊహించని విజయాలు సాధించారు. 1975 లో చేతిలో పైసా లేకుండా..పొట్ట చేత బట్టుకొని  బాబూరావు టిక్కెట్ లేకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రైలెక్కారు. హైదరాబాద్ లో ఏం చేయాలో తెలీదు.. ఓ బట్టల కొట్టులో సేల్స్ మెన్ గా ఉద్యోగం దొరికింది. అదికూడా…కొంతకాలమే వుండింది.మళ్ళీ కేరాఫ్ రోడ్డే..! ఉంటానికి,తింటానికి ఏం లేదు.ఫుట్ పాత్ పైనే పండుడు. నాంపల్లి రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూమ్ లో  స్నాన పానాదులు.ఈ విషయాన్ని ఆయన మాటల్లోనే వినండి..

“I came to this city penniless. So, even after I got the job, for a good fifteen days, I slept on the footpath, and bathed at the waiting room of Nampally station,”

‌                   …*Babu Rao.!!

1976 లో బాబురావు కేఫ్ నీలోఫర్ లో క్లీనర్ (Cleaner) గా చేరారు. బాగా కష్టపడ్డాడు.సిన్సియర్ గా ఇచ్చిన పని చేశాడు.అప్పటి కేఫ్ నీలో ఫర్ యజమాని దృష్టి లో పడ్డాడు.వెయిటర్ గా ప్రమోట్ అయ్యాడు.ఆతర్వాత టీ మాస్టర్ అయ్యాడు.సూపర్ వైజర్ అయ్యాడు.చివరకు కేఫ్…. యజమానిగా మారాడు‌.అంతా కల్లా జరిగిపోయినా…. దాని వెనుక బాబూరావు అకుంఠిత దీక్ష,కృషి,కష్టం వుంది. 197

8లో యజమాని కేఫ్ ను బాబూరావు చేతిలో పెట్టాడు.ఇరానీ చాయ్.. ఉస్మానియా బిస్కెట్స్ అమ్మేట్లు … ఒప్పందం…అలా అంచెలంచెలుగా బాబురావు యజమానిగా మారిపోయాడు.పెద్దగా చదువు లేదు…కేవలం కష్టం, అనుభవంతో నీలో ఫర్ కేఫ్ కు మహర్దశ పట్టించాడు..

ప్రస్తుతం..మూడు ఔట్ లెట్స్ కు యజమాని అయ్యాడు.

( who is now the proud owner of three outlets of Niloufer Café in the city.)

కేఫ్ నీలో ఫర్ అండ్ బ్రేకర్స్..పేరుతో అత్యంత ఆధునిక మైన బేకరీని 2016 లో ప్రస్తుత కేఫ్ కు సమీపంలోనే ప్రారంభించాడు.అది విజయవంతమైంది.గత ఏడాది బంజారాహిల్స్ లో మరో బేకరీని ప్రారంభించాడు.అదీ విజయవంతంగా నిర్వహించబడుతోంది.బేకరీలో అన్నిరకాల కుకీస్,బిస్కెట్స్,ఇతర స్నాక్స్ ను అందుబాటులో వుంచారు.. రకరకాల కేకులు కూడా దొరుకుతాయి‌. క్రిస్మస్ న్యూయర్,లాంటి సందర్భాల్లో నీలో ఫర్ కేకులకు విపరీతమైన డిమాండ్ వుంటుంది.ఇక నీలో ఫర్ బ్రాండ్ చాయ్..సరేసరి. ఆన్ లైన్…!!

ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా బ్రేకర్స్ ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారు.సిగ్గీ,జొమాటొ లాంటి సంస్థలు కూడా బేకరీ ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాయి. *చాయ్ పత్తా..కూడా.!! ఇటీవలే..టీపొడి (చాయ్ పత్తా )వ్యాపారం కూడా ప్రారంభించాడు. అది కూడా నీలో ఫర్ (చాయ్ పత్తా )పేరుతోనే.దానికీ విశేషాదరణ లభిస్తోంది. *సామాజిక సేవ..చారిటీ..!!

బాబురావు ఎంత సంపాదించినా..అందులో కొంత మొత్తాన్ని విధిగా సామాజిక సేవకు వినియోగిస్తున్నారు.ఇక్కడి నీలోఫర్ హాస్పిటల్ కు వచ్చే పేదరోగులకు,వారితో పాటు వచ్చే అటెండెంట్ లకు అప్పుడప్పుడు  ఉచితంగా భోజనం, అల్పాహారం అందిస్తుంటారు.అలాగే స్తోమత లేని పేదలకు సంబంధించిన మృతి దేహాలను వారి సొంతూళ్ళకు తరలించడానికి కూడా సాయం చేస్తుంటాడు..కేఫ్ పక్కనే వున్న దేవాలయ నిర్వహణకు కూడా ఆర్ధికసాయం చేస్తుంటాడు. ఇవి తెలిసినవి..ఇంకా తెలీని గుప్తదానాలెన్నో చేస్తుంటాడు..‌ఎంత ఎత్తుకు ఎదిగినా…తన మూలాలు మరువని వ్యక్తి..బాబూరావు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా 40యేళ్ళక్రితం హైదరాబాద్ కు వచ్చిన బాబురావు… ప్రస్తుతం సంపన్నుడు.ఓ పెద్ద కారు. చేతిలో ఐ ఫోన్… బ్యాంక్ బ్యాలెన్స్..సమాజంలో గౌరవం. అన్నింటికీ మించి హృదయత..పెద్ద మనసు.

పని ఏదన్నది కాకుండా..ఇష్టంగా చేసుకుంటూ పోవడం..తన రెక్కల కష్టమే పెట్టుబడిగా పెట్టి ఎదిగిన బాబు రావు”కృషివుంటే… ఎవరైనా..బాబురావు కావచ్చని ” అంటున్నారు.

అన్నట్టు… మీరెప్పుడైనా ఇటుగా వస్తే మాత్రం…

నీలో ఫర్ ‘ చాయ్ ‘  ను సిప్ చేయకుండా వెళ్ళకండి..!!

Abdul Rajahussen writer

 

 

 

 

 

*ఎ.రజాహుస్సేన్..!!

హైదరాబాద్..!!

Leave A Reply

Your email address will not be published.

Breaking