Header Top logo

16న భీమ్ గల్ లో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు

16న భీమ్ గల్ లో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు

ఆరోగ్యం బాగులేదాని భాద పడుతున్నారా..

అయితే.. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు మీ కోసమే..

నిజామాబాద్, ఏప్రిల్ 10 (వైడ్ న్యూస్) చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మధు శేఖర్ గారి వైద్య బృందం పేదలకు వైద్య సేవాలు అందించడానికి ఏప్రిల్ 16న ఉదయం భీమ్ గల్ లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు వస్తున్నారు.

ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు వైద్యులు రోగులకు ఉచితంగా చికిత్స అందించి మెడిసిన్స్ కూడా అంద చేస్తారు. మొండి రోగాలకు సైతం చికిత్స అందించే 45 మంది ప్రత్యేక వైద్య నిపుణులు ఈ శిభిరంలో పాల్గొంటున్నారు.

శస్త్ర చికిత్స అవసరమగు రోగులకు ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎం.జె. హాస్పిటల్ లో ఎంపిక చేసిన కేసులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తమన్నారు చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బి.మధు శేఖర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking