Header Top logo

పేదల హృదయాలలో శంభీపూర్ రాజు

శంభీపూర్ రాజు జీవిత ప్రస్థానం..

జై తెలంగాణ.. జైజై తెలంగాణ..

ఉద్యమమే ఊపీరిగా నినాదాలు చేసాడు ఆ యువకుడు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి కేసీఆర్ పిలుపుకు 21 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి దూకాడు. ఒక చేత్తో టీఆర్ ఎస్ జెండా పట్టుకుని.. మరో చేతి పిడికిలి బిగించి ‘‘జై తెలంగాణ..’’ అంటూ నినాదాలు చేసాడు. అప్పుడే.. ఉద్యమంలో పరుగులు పెడుతున్న ఆ యువకుడు 2001లోనే కల్వకుంట్ల చంద్రశేఖర్ (కేసీఆర్) దృష్టిలో పడ్డాడు.

‘‘ఇగో.. మన తెలంగాణ ఉద్యమానికి ఇలాంటి యువకులే కావాలి..’’ మనసులో అనుకున్నాడెమో కేసీఆర్ ఆ యువకుడిని దగ్గరకు పిలిచాడు.

‘‘నీ పేరేంది.. ఎక్కడుంటావ్..’’ అడిగాడు కేసీఆర్.

‘‘నా పేరు శంభీపూర్ రాజు.. హైదరాబాద్ లోనే ఉంటా..’’ నవ్వుతూ చెప్పాడు రాజు.

ఆ యువకుడి మాటలకు ముగ్దుడయ్యాడు ఆ పెద్దాయన. కేసీఆర్ చాలా తెలివైన మేధావి. ఒకసారి మాట్లాడితే అతనిలో ఉన్న టాలెంట్ ను సులువుగా గుర్తిస్తాడు. ఆ కేసీఆర్ పిలుపుతో ముందుకు ఉరికిన రాజుకు ఉద్యమంలోనే పరిచయం అయ్యాడు కేసీఆర్ తనయుడు కేటీ రామారావు.

తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు..

తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి పోలీసులను ప్రయోగించారు. ఉద్యమం చేసే యువకులపై లాఠీలు ఝుళిపించారు. అయినా.. కేసీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా , కుత్బుల్లాపూర్‌ మండలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమంలో ముందు వరసులో నిలబడ్డాడు శంభీపూర్ రాజు. ఖాకీల లాఠీలకు ఎదురెళ్లాడు. రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశాడు. రాస్తారోకోలు చేశాడు. బంద్ లు పాల్గొన్నాడు. ఆంధ్ర పాలకుల దోపిడీని నిలదీశాడు. అప్పుడే.. అమెరికా నుంచి 2006లో వచ్చిన కేటీఆర్ కు ఉద్యమంలో మరింతా దగ్గరయ్యాడు రాజు. ఒక సందర్భంలో బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..

‘‘కేసీఆర్ పారంభించిన తెలంగాణ ఉద్యమంలో ఈ ఏరియా నుంచి తెలంగాణ జెండా పట్టిన ఏకైక యువకుడు శంభీపూర్ రాజు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఆ జెండాను విడువలేడు. శభ్బాష్ రాజు..’’ అంటూ రాజును మెచ్చుకున్నాడు కేటీఆర్. అతని మాటలు రాజుకు ఎప్పుడు గుర్తుకు వస్తాయి.

కేసీఆర్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా..

ఇగో.. ఆ శంభీపూర్ రాజు ఇప్పుడు ‘‘ప్రజల మనిషి’’ అయ్యాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫ్యామిలీకి నమ్మక బంటు అయ్యాడు. తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకున్న రాజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తనకు వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకుని ప్రజా క్షేత్రంలో ‘‘మాస్ లీడర్’’ అయ్యాడు. అతి చిన్న వయసులో పెద్దల సభకు వెళ్లి తెలంగాణ రాష్ట్రంలోనే ‘‘శంభీపూర్ రాజు’’ అంటే గుర్తు పట్టే స్థాయికి ఎదిగాడు.

జీవిత ప్రస్థానం..  

శంబీపూర్ రాజుది  తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా , కుత్బుల్లాపూర్‌ మండలం , శంబీపూర్ గ్రామం. 4 జనవరి 1980లో ఆంజనేయులు, వినోద దంపతులకు జన్మించాడు అతను. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చెప్పే మాటలను ఆలోచించాడు. ‘‘డబ్బు కంటే పేదల కష్టాలు తీర్చడమే ముఖ్యం’’ అంటూ పేరేంట్స్ నూరి పోసిన నీతిని ఎప్పుడు తప్పలేడు.

ప్రజల బాధలను చదివాడు..

స్కూల్ కు వెళ్లి చదివింది తక్కువే. కానీ.. కళ్ల ముందు కనిపించే పేదల బాధలను చదివాడు. సమాజంలో జరిగే మోసాలను చూశాడు. ఆపదలో ఉండే ప్రజలకు సహాయం చేయడమే తన ముందున్న లక్ష్యం అనుకున్నాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుంకరి రాజు. కానీ.. ప్రజాక్షేత్రంలో మారు పేరును మరిచి పోయిన జనం మాత్రం ఊరు పేరు ‘‘శంభీపూర్’’ ను అతని పేరుగా చేర్చి ‘‘శంభీపూర్ రాజు’’గా పిలువడం మొదలు పెట్టారు. సుంకరి రాజు అంటే ఎవరికి పరిచయం లేని పేరు. కానీ.. శంభీపూర్ రాజు అంటే తెలంగాణలో గుర్తు పట్టే స్థాయికి ఎదిగాడు రాజు.

రాజకీయ ప్రస్థానం..

ఉద్యమమే ఊపిరిగా పద్నాలుగేళ్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన శంభీపూర్ రాజు కేసీఆర్ ఫ్యామిలీ ఆశీస్సులతో మాస్ లీడర్ గా ఎదిగాడు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా విజయం సాధించడం అతని జీవితంలో మరిచి పోలేని అనుభూతి. శాసన మండలి విప్ గా అతనికి అదనపు గౌరవం.

అంచెలంచెలుగా ఎదిగి..

ఉద్యమంలో నిస్వార్థంగా పోరాటాలు చేస్తుంటే పదవులు వంగి సలాం చేస్తూ వెల్ కమ్ చెబుతాయనేది శంభీపూర్ రాజు జీవితంలో ఎదురైన సంఘటనలు ఎన్నో. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ మండల కోశాధికారిగా, బీసీ సెల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, యువజన విభాగం సెక్రటరీ జనరల్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ పటిష్టతకు కృషి చేశాడు.

వరంగల్ సభకు 50 లక్షల విరాళం..

వరంగల్ సభకు విరాళాల సేకరణ నిమిత్తం కేసీఆర్ కూలి పనులు చేసేందుకు సిద్దం కాగా అందుకు కుత్బుల్లాపూర్‌ను ఎంపిక చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించడమే గాక, రూ. 50 లక్షలు సేకరించి కేసీఆర్‌తో శభాష్ అనిపించుకున్నాడు. తన ఉద్యమ ప్రస్తానాన్ని కొనసాగించిన రాజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా  పోటీ చేసి ఎమ్మెల్సీ గా విజయం సాధించారు.

పెద్దల సభకు చిన్నోడు..

ప్రజలను ప్రేమించే గుణం ఉంటే.. ప్రజా సేవా చేయాలనే పట్టుదల ఉంటే వయస్సుతో పని లేకుండానే 1980 జనవరి 4న జన్మించిన శంభీపూర్ రాజు రెండు శాసన మండళ్లలో అందరికంటే చిన్నవాడు కావడం గమనార్హం. 2017లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2021 నవంబర్‌ 14న రెండో సారి ఎమ్మెల్సీగా రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు. 26 జనవరి 2022న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. సీఎం కే.చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో శాసన మండలి విప్ గా శంభీపూర్ రాజుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

శంభీపూర్ రాజు కుటుంబం..

శంభీపూర్ రాజు తల్లి వినోద, తండ్రి అంజనేయులు, ఔను నేను, నాభార్య లావణ్య మేము ఇద్దరం మాకు ఇద్దరు..  కుమారుడు దీపక్ రావు, కూతురు స్నికిత. చిన్న కుటుంబం చింతాలు లేని కుటుంబంలా ఉంది  శంభీపూర్ రాజు జీవితం.

—-    —–

శంభీపూర్ రాజుతో..  

శంభీపూర్ రాజు.. తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పేరు వింటున్నాదే.. కానీ.. జర్నలిస్ట్ గా అతనిని కలిసిన సందర్భం ఎప్పుడు రాలేదు. ప్రియ శిష్యుడు రామారావు (రాము-జర్నలిస్ట్), రవిచంద్ర (జర్నలిస్ట్)లతో కలిసి కారులో శంభీపూర్ రాజును కలువడానికి ప్రయాణం.

తొమ్మిది గంటలకే శంభీపూర్ రాజు ఆఫీస్ ప్రాంతమంతా జనంతో కళకళలాడుతుంది. శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ.. అయినా ఇంత జనం అతని కోసం ఎందుకు వచ్చినట్లు మనసులోనే మెదులుతున్న ప్రశ్నలు..

శంభీపూర్ రాజు అందరిలా కాడు.. ప్రజల బాధలను తన బాధగా భావించి వాళ్ల జీవితాలకు భరోసా ఇచ్చే పెద్ద మనిషి. అందుకే ఈ మాస్ – రిచ్ జనం బాధలను చెప్పుకోవడానికి వచ్చారనిపించింది. శంభీపూర్ రాజు ఆఫీస్ లోనికి మా కారు వెళుతుంటే ఆవరణలో ఇరువై కారులకు పైగానే ఉన్నాయి. రెండు, మూడు వందల మంది వరకు జనం ఉన్నారు.

నాకు నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (గోవన్న) గుర్తుకు వచ్చాడు. అతను నిజామాబాద్ జిల్లాలో మాస్ లీడర్.. ఆపదలో ఉండి ఎవరు వెళ్లినా అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తాడు. అందుకే అతని వద్దకు వెళ్లినప్పుడు కనిపించిన జనం శంభీపూర్ రాజు దగ్గర కనిపించింది.

ఆ జనంకు ఎలాంటి ఇబ్బందులకు గాకుండా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పర్సనల్ సెక్రటరీలు ఉన్నారు. బాధతోనో.. సమస్యతోనే అక్కడికి వచ్చిన వాళ్లందరిని టిఫిన్ చేయుమని చెబుతున్నారు. ‘‘ మేము టిఫిన్ చేస్తున్నప్పుడు శంభీపూర్ రాజు సార్ బయటకు వస్తే..’’ కొందరు టిఫిన్ చేయకుండానే ఆ టెంట్ కిందనే కూర్చుని ఉన్నారు.

రాము మాత్రం శంభీపూర్ రాజు పిఎలతో.. అక్కడికి వచ్చిన పొలిటికల్ లీడర్ లతో చనువుగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతమంగా ప్లెక్సిలతో గులాభిమాయంగా కనిపించింది. కేసీఆర్, కేటీఆర్, శంభీపూర్ రాజు ల ఫోటోలతో ప్లెక్సిలు.. సెల్ ఫోన్ క్లిక్ మనిపించాను.

ఆ రాములో నన్ను నేను చూసుకుంటున్నాను. ముప్పయి ఎనిమిదేళ్ల జర్నలిజం జీవితంలో నాతో పాటు పని చేసిన శిష్యులు ఎందరో ఉన్నారు. కానీ.. రాముకు నేనాంటే ప్రేమ. ఇన్నేళ్ల జీవితంలో ఉండటానికి ఇల్లు లేదు.. ఆస్థులు అసలే లేవు.. అప్పులు మాత్రం ఉన్నాయని బాధ పడే వారిలో రాము ముందు వరుసలో ఉంటాడు.

‘‘సార్.. ఎప్పుడు బయటకు వస్తాడు..’’ పిఎ సీతారాంను జనం అడుగుతున్న ప్రశ్న.

‘‘ఆర్ డివో మల్లయ్య సార్ తో ప్లాట్ల విషయం మాట్లాడుతున్నాడు. టిఫిన్ కూడా చేసాడు.. మరో పది నిముషాల్లో వస్తాడు. మీరు అంతలోపు టిఫిన్ చేసి రండి.’’ అన్నాడు సీతారాం.

టిఫిన్.. వద్ద క్యూలో ఉన్న జనంను చూసి ఆశ్చర్య పోయాను. జనం ఎంత మందైనా రాని వాళ్లందరికి టిఫిన్ పెట్టే ఏర్పాటు చేసాడు శంభీపూర్ రాజు.

పర్సనల్ రూమ్ నుంచి శంభీపూర్ రాజు బయటకు రాగానే దగ్గరకు వెళ్లిన రామును గుర్తు పట్టాడు.

‘‘రాము భాయ్.. పబ్లిక్ తో మాట్లాడి వస్తాను. మీరు ఈ రూమ్ లో టిఫిన్ చేయుండ్రి.’’ అన్నాడు రాజు.

పది నిముషాలలో పిలుపు..

రాము, రవిచంద్ర, నేను ముగ్గురం అతని ప్రత్యేక గదిలోకి వెళ్లాం.

నేను రాసిన ‘‘డబ్బు కోసం.. జర్నలిస్ట్ డైరీ, డాక్టర్ కేశవరెడ్డి జర్నలిస్ట్ డైరీ’’ ఈ రెండు పుస్తకాలు శంభీపూర్ రాజు గారికి ఇస్తుంటే జర్నలిస్ట్ మితృడు రవిచంద్ర సెల్ ఫోన్ తో ఫోటోలు తీసాడు.

ఐదు నిముషాలు మాట్లాడి వెళ్లి వచ్చాం.

కానీ.. ఆ శంభీపూర్ రాజు ఆలోచనలు మదిలో మెదులుతున్నాయి.

జనం బాధలను ఓర్పుతో వింటూ వారి హృదయాలలో నిలుస్తున్న రాజు గ్రేట్ అనిపించింది. సమస్యల వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు సెల్ తో ఫోటోలు తీసుకుంటుంటే ఓపికతో వారికి సహాకరిస్తున్నారు శంభీపూర్ రాజు.

కుళ్లిన ఈ సమాజంలో ప్రజల హృదయాలలో నిలుస్తున్న శంభీపూర్ రాజు జీవిత, రాజకీయ ప్రస్థానం గురించి స్టోరీ ఇవ్వాలనే ఆలోచనకు అక్షరూపం..

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking